మునులందరు మీరు పరమ మంచోళ్ళవుదురు గాక అని శపించరెందుకు….?
రామాయణ,భారత,భాగవతాదులు మొదలు వేదాలు,పురాణాల వరకు ఏ హైందవ వాజ్ఞయం తీసుకున్నా శపించటం,వరాలు కురిపించటం అనేది అత్యంత ముఖ్యమయిన అంశం. వశిష్టుడు,అగశ్త్యుడు, విశ్వామిత్రుడు వంటి అత్యంత ప్రభావిత గురువులు మెదలు బ్రహ్మ,విష్టు, మహేశ్వరుల వరకు ఎదోక సంధర్బంలో శపించన వారే. భక్తి ప్రపత్తులు,కధాగమనం,కధాసారాంశాల దృష్ట్య కాకుండా, లాభనష్టాల పరంగా ఆలోచిస్తే నాకు ఉదయించిన ప్రశ్న ” శాపించేప్పుడు ఎప్పుడూ తప్పుడు వెధవాయి లయిపోండి” అని మాత్రమే శపిస్తారు అని.
ఉదాహరణకు: రామాయణంలో కభంధుడినే తీసుకుందాం, గంధర్వుడు, సూర్యసమాన తేజో వంతుడయిన దనువు, తన భుద్దియందు వైక్లభ్యం చేత వికృత రూపము దాల్చి, అడవిలో ప్రవేశించి(నగరంలో కాదు) అందరినీ భయచిత్తులను చేస్తూ ఆనందించే వాడు,అలా ఒకానొక రోజు స్తూల శూరుడనే ముని చేత శపించబడతాడు. అలా శపించబడిన ధనువు ఆ ముని పాదముల పైబడి పరిహారం కోరతాడు. రామలక్ష్మణ్లు చేత సంహరింప బడిన నాడు, తిరిగి ధనువుగా పూర్వరూపం పొందుతావని అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ధనువు బ్రహ్మగూర్చి ఘోరతపస్సు చేసి, ధీర్ఘాయుర్దాయం సిద్ధించుకుంటాడు(గంధర్వుడు కనుక అడగ్గానే అంత అమూల్యమయిన వరం వచ్చి ఉంటుందేమో, మానవులకు ఆ వరం ఇవ్వబడదు కదా…). ఆ వరగర్వంతో ఇంద్రుని మీద యుద్దానికి పోయి తల కాళ్ళు పోగొట్టుకుంటాడు. భ్రహ్మ వరాన్ని గుర్తుంచుకుని, ఇంద్రుడు రెండు యోజనాల చేతులు ఒక నోరు ఇస్తాడు బోజన సదుపాయం కోసం.(తెలుగు నుడికారంలో వాడ బడే “కబంధ హస్తాలు” అన్న పదం – ఈ కధనుంచి వచ్చినదే). అలా వికృత రూపిగా మారి. ఆ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేస్తూ… చివరికి రామునిచే విగతుడవుతాడు.(వాల్మీకి రామాయణం అరణ్యకాండ నుంచి).
పై కధను, ప్రస్తుత కాలమానం ప్రకారం మార్చి తీసుకుంటే: తెలివయిన, అందమయిన వారు అయి ఉండి,గొప్ప కుటుంబం నుంచి వచ్చామన్న మదప్రభావంతో వెధవ పనులు చేసే వారందరూ ఈ ధనువు వారసులనచ్చు. వారికి మానవులు విధించే శిక్ష కారాగారం, శృతిమించితే పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి వారికున్న ఆ భావాన్ని తమ మెదడునుంచి బయటకు తోసేసి మళ్ళీ మనుషులుగా మార్చాలని ప్రయత్నం. లేక తలిదండ్రులు భాధ్యత గుర్తెరిగిన వారయితే ..పిల్లవాడిని/సదరు వ్యక్తిని సైక్యర్టిష్ట్కు చూపించి వారికి ఉన్న పిచ్చిని నయం చేయింటమో చేసి చివరికి మళ్ళీ మంచి వారిని చేస్తారు.
కాని అక్కడ ముని చేసినట్టు చేస్తే… ఇంకా నిత్య దరిదృడివి అయిపో, ఇంకా నికృష్టుడివి అయిపో అంటే… వాడు సంచరించే ప్రాంతంలో వున్నవారందరూ భాదించబడుతారు దాని వల్లా వాడి ఖాతాలో మరింత పాపం పేరుకు పోవటానికి ప్రేరేపించిన వాడిని అవుతున్నాను. అని మునులు ఎందుకు ఆలోచించరు…? కధాపరంగా కభందుడీ అవసరం రామయణానికి లేదు, స్తూల శూరుడనే ఒక కారెక్టర్ దండగ తప్ప(సినిమా వాళ్ళ దృష్ట్యా) ఈ కభందుడు అలియాస్ ధనువును నీ భుద్ది మంచిగా మారుగాక అని శపిస్తే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి…
అలాగే విశ్వామిత్రుడు శాపాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే….విశ్వామిత్రుడు సైక్యార్టిష్టు కేసులన్నీ క్రిమినల్ కేసులుగా మార్చాటానికి వారి మంత్ర ప్రబావాన్ని ఖర్చు చేసుకున్నారు ఎందుకు….?
ఇక పోతే సనకసనందనాదులునే తీసుకుందాం, జయ విజయులు పాపం వారి ధర్మం వారు చేస్తున్నారు. శపించి పారేశే, ఎవరు భాదపడింది, రెండు యుగాలు పాటు మనుషులు దారుణమయిన జీవనం గడిపారు(రావణ కుంభకర్ణులచే,కంసునిచే,హిరణ్యాక్షుడు,హిరణ్యకశిపుడు, వగైరా …వగైరా… ). అదేందో… నువ్వూ మంచివాడి వయి ధర్మజీవనం గడూపుతూ భూమి మీద జన్మించు అని శాపం ఇచ్చారు అనుకో …..దర్మాతులయి జీవితాలు ఎంత దయనీయంగా, కష్టతరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా ….. హరిశ్చంద్రుడు ఉదాహరణ ఉండనే ఉంది కదా….. నిజంగ…. పాపానికి పరిహారంగా శాపం విధించాలి అంటే… ధర్మాత్ములయిపోదురు అని శపిస్తే …వాడి తిక్క ఆణిగి తిమ్మిరెక్కుతుంది కదా మరి….. ఎమంటారు …??????
(ఇంకా ఉంది)
నువ్వు దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నావు?
చిన్నతనంలో అత్యంత భక్తి ప్రపత్తులతో మెలిగే వాతవరణలో పెరిగినప్పటికీ, ఊహ తెలిసే కొలది దేవుని గురించి, దేవుని ఆవశ్యకత గురించి ప్రశ్న మెదలయింది. మా తాతగారి తో మెదలయిన ఈ ప్రశ్నల పరంపర నేటికీ అంతం లేకుండా సాగుతునే ఉంది. తారస పడిన ప్రతి ఒక్కరిని నేను ఎప్పుడూ అడిగే ప్రశ్న – ” నువ్వు ఎందుకు దేవున్ని పూజిస్తున్నావు అని?”. సమాధానం చెప్పవలసిన వారు మారారు కాని, ప్రశ్న మాత్రం అలానే ఉంది. ’పిచ్చి ప్రశ్న’ అని కొందరు కొట్టి పారేస్తే, కొందరు సమాధాన పరచటానికి ప్రయత్నించారు, కొందరు సమాధానం నాలోంచే వస్తుంది ప్రయత్నించు అని వెన్నుతట్టారు. నాకు వచ్చే సమాధానాలు అన్ని, వారి వారి చేష్టితాలను సమర్దించేవి గా ఉన్నాయి కాని, వారి భావాన్ని సమగ్రంగా ప్రతి పాదించేవిగా, కనిపించ లేదు.వయసుతో బాటు ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టాలి అనే జిజ్ఞాస కూడా పెరుగుతూ వచ్చింది. నా తోటివారందరు, వారి వారి ప్రార్ధనా మందిరాలకు పోయి, వాటి గురించి బళ్ళో చర్చించుకుంటుంటే,వారినీ అడిగాను, కొందరు నవ్వారు, కొందరు అంత కమ్మని పులిహోర వదులుకునే వాడు తిక్కలోడు అన్నారు, మరికొందరు మా నాన్న ఇలాంటివి అడిగితే కొడతాడు అన్నారు(చిన్నతనం కదా అలాంటి సమాధానలు మాత్రమే వస్తాయి అని అప్పుడు నాకు తెలీదు,ఎందుకంటే నేను ఆ పిల్లల్లో ఒక్కణ్ణే).
శైశవ దశలో పెద్దలనుంచి, పిన్నల నుంచి నాకు లభించినవి సమాధానాలు అన్ని దద్దోజన పర్యాయపదాలే. స్కూలు దాటి కాలేజీలోకి చేరేలోపు, పీఠాధిపతులనుంచి పీచు మిఠాయి అమ్మే వాడివరకు అదే ప్రశ్నని అడుగుతూ ఒక రౌండు ముగుంచాను.(ఇంటర్)కాలేజీలో చేరిన మెదటిరోజు. బడిలో లాగానే, ప్రార్దనతో మెదలవుతుందేమో అని గ్ర్రౌందులో కాసేపు ఎదురు చూసాను,కాని అక్కడ సర్వస్వతీ నమస్తుభ్యాలు (ఎండలో,చలిలో), సాయంత్రం జనగణమణలు ఏమి లేవు అని తెలుసుకోగానే, నాలో యక్షుడు నిద్రలేచాడు, పది సంవత్సరాలు పాటు ప్రతి ఉదయం పఠించినప్పటికి ఉచ్చరణాదోషాలు లేకుండా ఆ ప్రార్దన చేసేవారు కనపడటం అరుదు. ప్రార్దన, అదొక నియమం, అంతకన్నా ప్రార్దన చేసే వారికి కాని, చేయించే వారికి దాని ఆవశ్యకత ఎంతతెలుసో నాకు తెలియదు. ఇది గమనించిన నాకు, అక్కడి వారు నాకెందుకో హేతుభద్దమయిన వారులా కనిపించారు.ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే వారు ఇక్కడ దొరుకుతారేమో కనుక్కో అని నాలో యక్షుడు తొందర పెడుతున్నాడు. అక్కడ అంతా కొత్త మొఖాలు, కాని మొఖమాటాన్ని, నా ఉత్సుకత జయించింది. తారస పడిన వక్త(వ్యక్తులనుకను పొరబడేరు) లందరని అడుగుతూ వచ్చాను. కొత్తగా కాలేజీలో గ్రూప్ డిస్కషన్లు, వ్యాసరచనలు, ఇలా ఎక్కడ అవకాసం దొరికినా అదే ప్రశ్న… “నువ్వు దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నావు?”.అన్ని ప్రయత్నాలు సమాధాన శున్యాలే. (ఒక చిన్న్ విన్నపం, నాకు సమాధానం చెప్పలేక పోయారు అని నేను హేళన దృష్టితో నేన్నెడు చూసింది లేదు, చూడ బోయేది లేదు.ఎవరి పంధావారిది, ఎవరి నమ్మకం వారిది).
నాకు ఇందులో సమాధానం దొరకవచ్చు అనిపించిన పుస్తకాలు అన్నీ(నా పరిధిలో) చదివాను, ఒకదానికొకటి సంభందం వున్న పుస్తకాలే అవి, కాకపోతే మార్గాలు, విధానలు భేదం. కానీ నా ప్రశ్నగురించి ఊసేలేదు. ఎలా పూజించాలి, ఎన్ని రకాలుగా పూజించాలి, ఆఖరికి ఏ పనికి ఆదేవుడు, ఏపనికి ఆ పూజ స్తాయిలో అత్యంత నిర్మాణాత్మకంగా ఉంది. పక్కమతాల్లో కూడా చూశాను, రమారమి అన్ని మతాల్లో నాకు దొరికినంత వరకు చూశాను, ఒక నమ్మకం ఆధారంగా జనించిన ధాతువులే ఇవన్నీ అని తెలుస్తుంది కానీ.నాకు మాత్రం అవే సమాధానాలు, అవే ఈసడింపులు, ఎక్కిరింపులు….. అప్పుడప్పుడూ ప్రోత్సాహాలు…
కొంతకాలం నా ప్రశ్నే తప్పేమో అని అలోచించాను,కాని ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే గాని నిర్ణయించలేని పరిస్తితి. చివరికి స్నేహితుని తల్లి, చాలా సహనం కలిగినావిడ, చిన్నతనం నుంచి నా ప్రతి ఉపప్రశ్నలకు (ఆ ప్రశ్న అడిగినప్పుడు జనించే ప్రశ్నలు) సమాధానం చెబుతూ ఉండేది. కొంతకాలనికి ఆవిడక్కూడా విసుగొచ్చింది కాబోలు సమాధానాలు చెప్పటం మానారు. కాని ఆవిడ చెప్పిన సమాధానాలే నాకు తరచూ మిగిలిన వారందూ వారి వారి పరిభాషల్లో చెప్పేవారు. మచ్చుకు కొన్ని రాస్తను ఇక్కడ..
౧. ఆధ్యాత్మిక ఆనందం ( వయస్కులు, గురువులు , ఆపైన వారు చెప్పే సమాధానం)
౨. కోర్కలు నెరవేరాలి ( సాధరణ జనం , అప్పుడప్పుడూ లక్ష్మీపుత్రులు చెప్పే సమాధానం)
౩. పారంపర్య సంక్రమితం( దేవుడు చల్లగా చూడటం వల్ల ఇలా ఉన్నాం అని నమ్మే వారందరు చెప్పే సమాధానం)
౪. ఎందుకు అనవసరంగా రిస్కు ( బెనిఫిట్ ఆఫ్ డౌట్ – ఎక్కువగా యువత చెప్పే సమాధానం)
ఇవీ సమాధానాలు, ఇక్కడ అపహాస్యాల గురించి కూడా రాయాలి
౧. నాస్తికులు, హేతువాదులతో పోలికలు ( సమాధానం చెప్పలేకపోవటం, చెప్పాలి అనుకోకపోవటం అవమానంగా భావించిన వారు )
౨. పైన చెప్పిన శ్రేణి
౩. పైన చెప్పిన రెండు శ్రేణులు.
ఆ సమాధానాలు అన్ని నాకు అసమగ్రంగానే కనిపించాయి. ఒక్కొక్కటిగా చూస్తే …
౧. ఆధ్యాత్మిక ఆనందం:- సమయాభావం ఉన్నవారికి కలిగేది కాదు, పనినుంచి విశ్రమించిన వారికి, దైవార్చనే జీవిత పరమావధిగా కలిగిన వారికి మాత్రే దక్కే అమూల్య మయిన భావన అది సాధారణ వర్గానికి చెందే సమాధానం కాదు. గంటల తరబడి ఇదే సత్యం అని,ఇదే సత్యం అని నమ్మితే, ఎంతటి భేదాలోచన అయిన ఆత్మ సంత్రుప్తిని కలుగజేస్తుంది, మానసిన ఆనందాన్ని కలుగా జేస్తుంది. కనుక అక్కడ ఆధ్యాత్మిక ఆనందం సాధనం అనేద ఒక వ్యాపకం, దానికి దేవుడు అనేది ఒక మార్గం. ఆధ్యాత్మిక్ అనుభూతి అన్ని మతాల్లో, అన్ని వర్ణ వర్గ జాతుల్లో సమానంగానే ఉంటుంది. అన్ని విషయాల్లాగే మార్గం మాత్రం మార్పు.
౨. కోర్కెలు నెరవేరాలి:- “ఈ సమస్యకు ఎవరన్నా సహాయపడాలి్” – అన్న సాధారన మధ్యతరగతి జనితమయిన భావనకు తార్కాణం. పక్కవారిని అడగాలి అంటే చిన్నతనం. కనుక అజాతశత్రువు అయిన పరమాత్మే వారికి సహాయ పడతాడు(పడాలి) అన్న నమ్మకం.
౩. పారంపర్య సంక్రమితం:- ముందు తరం వారు ఇలానే తమ జీవనం సాగించారు నేను కూడా చేస్తున్నాను.
౪. ఎందుకు అనవసరంగా రిస్కు:- నష్టంలేనప్పుడు చేస్తే తప్పేముంది అన్న ఆలోచనకు మరోరూపం,దేవుడు, నమ్మాకాలు ఒకరోజు నిజమయితే ….. అన్న భావన.
ఇవన్నీ చూసిన/విన్న/చదివిన తరువాత సమాధానం వచ్చినట్టే కదా అనిపిస్తుంది. కాని ఆ శ్రేణులు చూపిస్తున్న కారణలు మరో రూపేణా చేసే అవకాశం ఉన్నప్పుడు, అలా రో రకంగా చేస్తున్నవారికి సరి యయిన సామాజిక గౌరవం లభించాలికదా? కాని వాస్తవం మరో రకంగా ఉంది. సానాతనులు,చాందసులు పక్కమతాలను దుయ్యబడుతుంటే, హేతువాదులు వీరిని అపహాస్యం చేస్తూ చివరికి తమ తమ వ్యక్తిత్వాన్ని పోగుట్టుకునే స్తాయికి దిగజారుతున్నారు.
అంటే భావాలని నమ్మి వాటిని పాటించే వారు ఆశించేది ఇంకేదన్నా అయి ఉందా? ఉంటే ఏమిటది ?
కనుక నా ప్రశ్న అలానే మిగిలి ఉంది…
Comments(10)
Comments(4)