మేము మాట్లేస్తం

సాటి సాహితీ ప్రియులకు సభికులకు కవులకు కవితగ్రేస్వరులకు అక్షరాభివందనములు…
ఈ మధ్యకాలం లో వచ్చే కవితాభిమానులు సాటి కవుల కవితలను కానీకు కూడా పనికిరనట్టు చూస్తుండటం చూసి…. విమర్శ సాహితీపరంగా చెయ్యాలి తప్ప సరదాగా చేయ్యరాదన్న ఆ మహాకవి తెనాలి వారి మాటను మరోసారి గుర్తు చేస్తూ ఈ కింద కవిత రాయటం జరిగింది…..

రండి రండి … మీరు కవులయితే రండి…
మీ పాత కవితలకు మేము మాట్లేస్తం,
రండి రండి మీ కవితలను తీసుకురండి,

మతం మీదరరాసిన,గతం మీద రాసిన,
రధం మీదరాసిన,పథం మీదరాసిన,
శక్తి మీద రాసిన వ్యక్తిమీద రాసినా,
భక్తిమీద రాసినా రక్తిమీద రాసిన,
రండి రండి తీసుకురండి మీ కవితలను తీసుకురండి, మాట్లేస్తం … మేమ్మాట్లేస్తం….
ఇక్కడ ,

పెన్నులతో పోట్లేస్తం,
మాటలతో కట్లేస్తం,
తియ్యగా తూట్లేస్తం,
అక్షరాల మాట్లేస్తం, మాట్లేస్తం … మేమ్మాట్లేస్తం….

అయ్యో అంతేనా అని వెళ్ళిపోకండి…రండి రండి….

భావాన్ని బతికిస్తాం,
వాక్యాలను అతికిస్తాం,  మాట్లేస్తం … మేమ్మాట్లేస్తం….

మీకవితను మార్చేస్తాం
అందంగా గెల్చేస్తం,    మాట్లేస్తం … మేమ్మాట్లేస్తం….

అయ్యో రండి రండి…. చలచలావున్నాయి రండి…..

ప్రయోగానాన్ని కూల్చేస్తం,
గంగలో తెల్చేస్తం…

అయ్యో అసలు ఇంత చెప్పిన రావటం లేదు ….
అయిన నాకే బహు చక్కని సందేహం …. అస్సలు ….
 కవినా నేకవినా ?
                           కవినా నేకవినా ?
వానకవినా! కోనకవినా?
నవకవినా! వనకవినా?
                             కవినా నేకవినా ?
వివేకకవినా ! వికవినా?
నవ్విన కవినా! కొవ్వినకవిన ?
విన్న కవినా! కొన్న కవినా?
                             కవినా నేకవినా ?
ఏది ఏమయినా  ..మాట్లేస్తం … మేమ్మాట్లేస్తం….

(పయిన రాసిన ఆరు వరుసలలో ” నే కవినా ?” అన్నా పదం లో వున్నా అక్షరాలు మాత్రమే వాడటం జరిగింది … గమనించ గలరు …)….

2 comments so far

  1. chadnramouli on

    తెలియని వన్ని తప్పులని దిట్టతనాన సభాం తరంబునన్
    బలుకఁగ రాకురోరి పలుమారు నీ బిశాచపు పాడేగట్టనీ
    పలికిన నోట దుమ్మువడ భావ్యమెరుఁగవు పెద్దలయినవా
    రాల నిరశింతురా! ప్రెగడరాణ్ణరసా విరసా / తుసా బుసా !

    తెనాలివారి ..దూషణాగ్ని శిఖకు ప్రతిజోడుగా వ్య్వహారికం లో రాయతలంచిన చిన్న ప్రయత్నం …

  2. ranganadhan k on

    yah ra
    nuvukavive…..navakavive……nee kaakaaku…chediriponi…chinni gnana….pipasini……kavithalatho….matlesina……thavikalotho…kaatlesina…neyathnam….harshamani………aarshamunu….jodinchamani……andarikandichamani……nee…..hithudagu………snehithudu…….

    Acharya RK (ranagaa)


Leave a reply