అమ్మా ఎక్కడున్నావమ్మ …
అమ్మా ఎక్కడున్నావమ్మ …
వరాలతల్లి ..
మా బంగారుతల్లి…
ఎక్కడున్నావమ్మా!!
తాటాకున నీ అందం,
కాగితాన ఏదమ్మ,
నన్నయ నడకతో వడివడిగా పరుగెట్టావ్,
గోనబుద్దుని చెఁత చిత్రంగా నర్తించావ్,
శ్రీనాధుని చెంతచేరి శృంగారం ఒలికిఁచావ్,
పోతనోద్దకుపోయి ప్రయొగాన్ని పండించావ్,
వేమయ్యతో సులభంగా కదిలోచ్చావ్..
ఆ తాటాకుల సహవాసమే నీ ఆవాసమయిందా ..
మా కాగితాలా కాభాగ్యం కరువయిందా
అమ్మా ఎక్కడున్నావమ్మ …
వరాలతల్లి ..
మా బంగారుతల్లి…
ఎక్కడున్నావమ్మా!!
క్రిష్ణదేవుని పంచజేరి,జనసంద్రపు మెప్పుబొంది,
అల్లసాని గంఠఁ లో రామకృష్ణ కఁఠఁ లో
ఆంధ్రకవి పద్యంలో,కృష్ణదేవుని గాత్రంలో,
సాహిత్యపుస్వర్గంలో పారిజతమయి వెలుగొఁదావ్,సోభిల్లావ్ …
అమ్మా… అంతటి.. సాహిత్యసౌందర్య రాసివి ఎక్కడున్నావమ్మ …
రాగిరేకుల వొదిగిన నీ అఁదఁ మా కాగితాన రానంద
అమ్మా ఎక్కడున్నావమ్మ …
వరాలతల్లి ..
మా బంగారుతల్లి…
ఎక్కడున్నావమ్మా!!
పరవస్తుతో అందంగా జట్టుకట్టి,
గురజాడ నేసిన వ్యవహారిక చీరజుట్టి,
గిడుగుకుట్టిన రవికగట్టి …
విశ్వనాధతో బావికవితకు బాటలేసి,
శ్రీ శ్రీ తో క్రొఁగొత్తగ అడుగులేసి నవలోకం చేరావే…
అమ్మా అంతటి సాహిత్య సౌందర్యం ఏదమ్మ…
ఆ నుడికారపు హొయలెక్కడ
ఆ పదసాగారలయలెక్కడ,
ఆ అమ్రుతాక్ష్రరద్వనులెక్కడ,
అమ్మా ఎక్కడున్నావమ్మ …
వరాలతల్లి ..
మా బంగారుతల్లి…
ఎక్కడున్నావమ్మా!!
సాటి సాహితీప్రియులకు అక్షరోన్ముఖవందనం
కవితాతీరం చేరిన ఈ కవిత మిక్కిలి దోషపూరితమయి ఉండొచ్చు, కొందరు కవులని ఆ కవితలో రాసివుండకపోవచు…. దాని నా అజ్ఞానంగా పరిగణించి మన్నించ ప్రార్ధన …ఆ కవితలో జోప్పించని కవిసామ్రాట్టులనవమానిన్చినటుల కాకుండా భావాభావంతో మాత్రమే అక్కడ రాయలేదన్న సత్యాన్ని గ్రహిఁచగలరని వేడుకొనుచున్నాను….
ఇంకా వ్యాఖ్యలు లేవు
Leave a reply