తెలుగులో ఎముందయ్యా… పెద్ద … ?
Palindrome విషయం లో ఇంగ్లీష్ వారు ” Able was I ere I saw Elba “ అనే వాక్యాన్ని గొప్పగా చెప్పుకుంటారు ఈ వాక్యం ఎటునుంచి చదివినా ఒకలాగే ఉంటుంది. దీని అర్ధం Elba ని చూసే మునుపు వరకు నేను సమర్ధుని గానే ఉన్నాను అని. Elba అనేది ఒక ice land పేరు
<http://en.wikipedia.org/wiki/Elba> ఆ దీవిని నెపోలియన్ చూసినంతనే అలా వచించారు …
దీన్ని సాహితీ జగత్తులో ఇంగ్లీష్ తరపున చాల గొప్పగా చెబుతారు…. ఇది ౧౭ వ శతాబ్దం లో చెప్పబడింది గా అంటారు…
దాన్ని చూసి ఇంగ్లీష్ వారు అంత గర్విస్తుంటే… మన ప్రతిభ చూడండి …..
తాం భూసుతాఁముక్తిముదారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీ !
– శ్రీ యాదవం భవ్యభతోయదేవం సంహారదా ముక్తిముతాసుభుతాం
సంస్క్రుతాంద్ర గొప్పదనం చెప్పడానికి ఈ ఒక్క మచుతునక చూస్తే చాలదా ….
” రామకృష్ణ విలోమకావ్యం ” అను ఈ సంస్క్రుతాంద్ర కావ్యం దైవజ్ఞ సూర్య పండితుడిచే రచించ బడింది….. మొదటి పాదం రాముడిని కీర్తిస్తూవుంటే … ఆ పాదం తిరగేసి రాస్తే …. రెండవ పాదం వస్తుంది….. అది కృష్ణుడిని కీర్తిస్తుంది…… అలా నలుబది పాదాల్లో రామాయణ భారతల్లో ముఖ్య ఘట్టాలను జోప్పించిన ఘనత …. ఆ సుర్యపండితునిది….
మొదటి పాదం యొక్క అర్ధం : దరహాసం చిందే లవుని ప్రేమించి దయగల లక్ష్మి అయిన సీతను నమస్కరిఁచుచున్నాను.
ఇక దాని విలోమమయినా రెండవపాదం యొక్క అర్ధం: మంగళప్రదమయిన ఆకర్షణ కలవాడయిన క్రిష్ణపరమాత్ముని గీత చెడుసంహారం చేస్తుంది అని ….
వివేకం తో చూసిన విచక్షణతో చూసిన స్తూలం గా చూసిన సూక్షంగా చూసిన …. తేనెలూరే
తెలుగు, సంస్కృత వాఙ్మయం నాడిగా గలిగిన మనతెలుగు …. అద్భుతమయినది అని చెప్పుట అతిశయోక్తి కాదేమో …
కందగతి లో సాగే ఈ కింద పద్యం చూడండి …
సారస నయనాఘన జఘ
నారచిత రతార కలిక హార సార రసా
సార రసారహా కలికర
తారత చిరనాఘ జనఘ నాయనసరసా
నంది-ఘంటక కవులు రాసిన ఈ పద్యం చఁదోబద్దఁ గా రాయబడినది …. ఎటుచదివినా ఒకేలా వుండే ఆ పద్యం గొప్పదనం చెప్పనలవి కాదుకదా!
ఇలాంటి …. మరుగునపడివున్న … అక్షర లక్ష్మి ….. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పుణ్యమా అంటూ కొంతవరకు బయటపడినా నిర్జీవమయిన సాహిత్య సంపద ఇంక ఎక్కడో ఉండేఉంటుంది ……వ్యవహారిక వాదం వల్లనో … కవురవవారసలులమయిన మన నవవాదం వల్లన్నో మన భాషలో ఇగురింకిపోయిన పదజాలం … కోకొల్లలు…. ఆ స్థానే … పరుషపదజాలం బహుచక్కగా భావితరానికి అందించే పాశ్చాత్య ప్రియవరులు, నవశకసాహితీస్తాపనోద్దరకులు, నాకు ఎందుకు తెలుగు అని తెలివిగా ప్రశ్నించే ఘనులు కనీసం ఇలాంటి కొన్ని నగ్న సత్యాలను … భావితరాలకు అందిస్తరనన్న ఆశతో … చంద్రం
నా వద్ద రామకృష్ణ విలోమకావ్యం కావ్యం PDF రూపం లో సంస్కృత లిపిలో భద్రపరచబడి వుండి …. …. కావలసినవారు….. తెలుపగలరు…….
వివరాలకు : http://www.sanskritdocuments.org/
ఇప్పటికి 1 వ్యాఖ్య
Leave a reply
చంద్రమౌళి గారు : తెలుగులో ఈ palindrome లాంటి పదాలు ఉన్నాయని తెలుసు గానీ ఇలాంటి పద్యాలు ఉన్నాయని ఇప్పటి వరకు తెలియదు … పరిచయం చేసినందులకు మీకు శతకోటి కృతజ్ఞతాభినందనలు .. మీకు వీలైతే రెండవ పద్యానికి కూడా అర్ధం తెలుపగలరా …. అందుకు మీకు ముందుగా ధన్యవాదములు.