అవిగో…సాహిత్య ఘంటికలు మ్రోగుతున్నాయి

అవిగో…సాహిత్య ఘంటికలు మ్రోగుతున్నాయి 
అయ్యారే …తెలుగు సాహితీసమరం పిలుస్తుంది …..

ఇవిగో అక్షరాశ్వాలు,
వ్యాకరణ భూషితమయి,
మీ కలాల ముంగిట నిలచయాయి,
రండి అధిరోహించండి….

అదిగో సాహిత్యసమరశంఖారావం పూరించబడింది
సుర్యతేజోప్రభాభాశితులయి
మీ సాహిత్య ఖడ్గాలను చేబూని రండి …

ప్రయోగరంజితమయి,
పరిపూర్ణకళాహ్రుదితోడ,
ఈ సమరభూమికి,
సంసిద్దులయి విజయంచేయండి,

అక్షరసాగారమధనం జరుగుతుంది …..
అద్భుతకవితామ్రుతపానఁ జరగబోతుందిక్కడ …..
ఇది ఒక గద్యపద్యపదకవితా సంగ్రామం…
విమర్శనాస్త్రాలని దునుమాడి
నీకవితా జయకేతనాన్ని ఈసాహిత్యసమరంలో ఎగురవేయి ……

అరుణాక్షరగీతాలు,
సరసోద్రేకభావాలు,
స్తుతసందీపిక రాగాలు,
ఆహా ! పదాంభుది గర్భాన
ఇలాంటి మరకతమణులెన్నున్నవో
మధించండి….కవీశ్వరులార…
అక్షరలక్ష్మినీభువిజేర్చువరకు
మధించండి…. కవీశ్వరులార…

సంస్కృత వాఙ్మయం నాడిగాకలిగిన తెలుగుభాష వాక్పటిమ అనిర్వచనీయం,అద్వితీయం,అమోఘామ్రుతంగమయం…..

2 comments so far

  1. కస్తూరి మురళీకృష్ణ on

    మీ కవిత బాగుంది. తెలుగు సాహిత్యం అభివ్రుధ్ధి చెందుతుంది అని ఆశిద్దాం.

  2. Pavithra on

    chaala bagundi mouli,
    nenusamaraniki sannaddam avutunnanu. telugu yagam cheddam, telugu ni ajaramaram ga unchadaniki.


Leave a reply