ఆసలు దొంగ గురించి ఎవరూ మాట్లాడరు ఏంటి చెప్మ…..???

తెలంగాణను వేరుకుంపటి ఊబిలో దించటం మాట పక్కన ఉంచి ఈ విషయం చూడండి, ఈ మధ్య చాల టీవీలు పత్రికలతో బాటు,అటు రాజకీయ నాయకులు ఇటు ప్రజలు తెలంగాణకి జరిగే అన్యాయం విషయంలో గోడమీద పిల్లిలా వుంటున్నాయి… ఎందుకు అంటున్నాను  అంటే .. ఒక రోజు తెలంగాణ వాళ్లు ఆంధ్రా రాబందుల చేతిలో అష్ట కష్టాలు పడుతున్నారు …అంటారు ..మరో రోజు తెలంగాణ మరో రాష్ట్రం ఇవ్వటం లో తప్పులేదు,ఇవ్వచ్చు అని లోపాయికారిగా అంటారు .. మరుసటి రోజు  మళ్ళి వాళ్ళే …ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం నీరుకార్చి ముడుపులు గుంజింది ఇప్పుడు తెలంగాణ ముద్దు బిడ్డంలం అని రొమ్ములు చరుస్తున్న వాళ్ళే అంటాడు …. అస్సలు నిజం ఏంటి అస్సలు తెలంగాణా వాళ్ళ అభుదయ్యని ఆపుతుంది కేవలం ఆంద్ర ప్రజలా ! లేక అక్కడ ప్రజల్లో ప్రజా ప్రతినుదులలో ఏదన్న లోపించా ? లేక మరేదన్నాన తెలియాలి !!!  ( తెలంగాణ వాళ్ళు తిట్టిపోసే ఆంధ్ర అంటే .. రాయలసీమ రాదుట మరియు శ్రీకాకుళం చుట్టుపక్కల జిల్లాలు కూడా రావంటండోయ్ అది కళింగాంద్ర అని వేరే ముక్కగా పరిగణిస్తున్నారు దీనిక్కూడా వారి వెనకబాటు తనానికి కూడకారణం ఆంద్ర వారే !! ఎంటో )

అస్సలు ఈ పత్రికలు ప్రజా శ్రేయ్యసు అనే పదంను  వాళ్ళ డిక్షనరీ లోంచి తీసేసరేమో అనిపిస్తుంది.ఈ మధ్య నేను తెలంగాణ మీద తెగ చదివేస్తున్న ..ఎందుకో !!! అంటారా! ఈ పత్రికలు మరియు నా చుట్టూ ఉండే స్పీకర్లు ఎవరి వాదనను వాళ్ళు వినిపిస్తూ ఒకదానికి ఒకటి సంభందం లేకుండా చెప్పటం చూసి నాకు నేను వెతుక్కుందాం అని చెప్పి చదవటం మొదలెట్టా. మొత్తంగా నేను నిర్ణయించుకున్నది ఇక్కడ రాస్తున్నాను …  నేను పుట్టాక ముందు నిజమయిన తెలంగాణ వుద్యమం జరిగిందట …మా పక్కింటి ఆయన చెబుతుంటాడు . నాకు అర్ధం కాదు అస్సలు … నిజమయిన వుద్యమం ..ఉత్తుత్తి ఉద్యమం అని రెండు ఉంటాయా !!! మరీ చోద్యం కాకా పొతే….అప్పటి భావాలు ఇప్పటి భావాలూ మరియు అప్పటి నాయకుల్లో పరమ పదించిన వారు మినహాయించి మిగిలినవారు అందరూ ఈ వుద్యమలో వున్నారు కదా..పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేస్తున్న మహాను భావులు కాళోజి గారితో సహా .. మరి ఏది నిజమయిన వుద్యమం .. రెండూ అంటారేమో .అప్పుడు ముడుపులు పుచ్చుకున్న మంత్రులు రాజకీయ వాదుల మద్యలోనే కదా ఈ వుద్యమం కూడా నడుస్తుంది …. మరి ఇప్పుడు కూడా నామం పెట్టరెంటి వాళ్ళకి (..అంటే తెలంగాణ ప్రజలకు ). అయిన అస్సలు ఆ పింక్ పార్టీ నాయకుడు అన్నాడుట “తెలంగాణ వచ్చాక నేను అభివృద్ది సాధించాక పొతే నన్ను రాళ్ళు పెట్టి కొట్టండి అని … ఇంతవరకు ఎంత మంది అన్యాయం చేసినవాళ్ళను రాళ్ళు పెట్టి కొట్టారు అక్కడ ప్రజలు…అస్సలు కొట్టే వాళ్ళు… ఇప్పుడే కోట్టొచ్చుకదా… అబ్బే అది జరగదు… ఎందుకంటే భయం …. మరి రాష్ట్రం వాచ్చక… సొంత కొడుకులే తల్లినమ్మేస్తుంటే ఏమి చేస్తారు మళ్ళి ఉద్యమం బాట పడుతార …తెలంగాణ ప్రజలను ప్రశాంతంగా ఉండ నివ్వరా ?  ఈ ఉద్యమ కారులు…?

 ఏదో ఉద్యమం అలవాటు అయింది కదా నిజాం వాళ్లతో చేసి చేసి, అదే ఊపు ఇక్కడ కూడా సాగిస్తం అంటే ఎలా, అప్పుడు బానిస బ్రతుకులోంచి బయటకు రాగానే స్వతంత్ర వాసను ఆస్వదించకుండా చేసిన వాళ్ళ లో ,తెలంగాణ ముద్దుబిడ్డని అని చెప్పుకునే ఇంటి దొంగలను బయటకు లాగి పడేయండి. అప్పుడు మీ అభ్యుదయాన్ని ఎవరు ఆపుతారు, మీ ఏరియా లో నాన్ లోకల్ M.L.A లు M.P లు లేకుండా చూసుకోండి అది మీ చేస్తుల్లోనేగా వుండేది. రేపు రాష్ట్రము వచ్చినప్పుడు చిత్తసుద్దిలేని రాజకీయ నాయకులూ మీ వారయినా డబ్బులు ప్రాణాలు ఇలానే గుంజుతారుకదా !  రేపు రాష్ట్రము వాచ్చక మిమ్మల్ని పీక్కు తినే వాళ్ళలో మొదట వుండే వాళ్ళు వారే. ఇది స్వాతంత్రఉద్యమం కాదు కదా. ఒక ఇంట్లో ఉండి వెన్ను పోటుపొడిచే వాళ్ళకు పుట్టినిల్లయిన  ప్రదేశం మనము అసలే కౌరవ సంతతికదా (భారతం ప్రకారం మనం కౌరవులం) విడిపోయి కంపు చేసుకోవటం కంటే మనలో వున్నా కౌరవున్ని చంపితే చాలు.  అస్సలు దొంగలు మనలో వున్నా భాద్యతలేని ప్రజలు, డబ్బుకోసం రాజకీయాల్లో తమ ప్రాణాలకు తెగించి పోరాడే నాయకులు  వాళ్ళు సొంత రాష్త్రంలో వున్నా పరాయి రాష్ట్రం నుంచి వలస వచ్చిన ,వాళ్లు వున్నంతవరకు ఇప్పుడు 70mm లో చూపిస్తున్న కష్టాలు Imax రేంజికి పోతాయి తప్ప … వేరు రాష్ట్రం వస్తే ఏదో వజ్ర వర్షం కురిసి పేదరికం పోతుంది అంతా హ్యాపీ హ్యాపీ అనుకుంటే పొరబాటే…

పోస్ట్ మరీ పెద్దగా వుంటే చదవటం కష్టం అని  ఇక్కడితో ఆపుతున్నాను … next పోస్టులో పింక్ పార్టీ చూపిస్తున్న్న అన్యాయాల జాబితా రాష్ట్రం వస్తే వాటిని ఎలా solve చేస్తాం అన్న వాటిమీద ఒబామా హిల్లరీ రెంజ్లో  demographics తో సహ మీ మున్డుకుతేవటానికి ప్రయత్నం చేస్తాను ….

చంద్ర 

7 comments so far

  1. suresh on

    మీరు రాసింది అంతా బాగానే ఉంది కాని ” భారతం ప్రకారం మనం కౌరవులం” అన్నారు అది సరి కాదు.
    మనము కృష్ణుడి వైపు.దుర్యోధనుడి తో కుదిరిన ఒప్పందం ప్రకారం శ్రీకృష్ణుడి వైపు వారు కౌరవులవైపు వెళ్ళారు.మనము అలా వెళ్ళిన వారము.

  2. chavakiran on

    ఈ పోస్ట్ గురించి కాదు కానీ,

    మీ బ్లాగు బాగుంది, కానీ… రావలసినన్ని కామెంట్లు రాలేదేమిటి చెప్మా?

  3. chandramouli on

    సురేష్ గారు,
    కౌరవులు అంటే, కేవలం ఆ నూట రెండుమంది కాదు కదా.
    ఆ భారత యుద్దం లో ౩౨ రాజ్యాల ఆంధ్రులు ఒక తరం పాటు పోరాడారు అంటే….
    మనం కౌరవులమయినట్టేకదా మీ దృష్టిలో కర్ణుడు కౌరవుడు ఆయితే నా మాట కరెక్టు అవుతుంది .. లేక పొతే తప్పు అవుత్నుంది …. మంచి మన్సులోవుంది తప్పు చేసిన చట్టం శిక్షించాలి అన్నా దానికి కట్టుబడి నేను మనల్ని కౌరవులగానే పరిగణిస్తాను .. అయిన ఇచ్చిన మాటకోసం కోసం ఒక తరం పాటు పోరాడిన మన ఆంధ్రులను కౌరవులుగా పరిగణించటం మనకు గొప్పతనమే కానీ … అహం చంపుకోవటం కాదు అని తలుస్తాను….

    @chavakiran గారు
    వస్తాయండి … నేను బ్లాగ్ స్టార్ట్ చేసి రెండు వారాలే కదండీ .. నేను ఎక్కడ పెట్టలేదు .. ఒక్క కూడలిలో తప్ప.. అదీను పెట్టి ఒక వారం కూడా కాలేదు .. అయిన మీలాంటి వారు అడపా దడపా ఇలా ఇస్తూనే వున్నారు … మీ అభిమాన పత్రుదనయినందుకు హర్ధదాయకం గా వుండి ….

    మీ కామెంట్స్ కు కృతజ్ఞుడను ….

  4. Vijay on

    Eee…..suththi story rasinavariki…..pennu paper vundhi……naa notiki vachchindhi raddam ane..vuddeshame thappa……asalu nijalu telusukundham……konchem alochinchi….nijalu raddhdham anna vuddesham…isumantha kooda lentutundhi…!!! [:D]…

    Okkate prasanaku samandhanam cheppu….

    Telangananu vadhili andhra bathakaledha?? [:P]..

    Bathakaledhu ani answer ayithe…..nuvvu cheppukunna pai story..sababe….:D

    Bathakagaladhu…ane nammakam vunte…….ee sodhi…sollu aapi…..telanganaku support cheyyi….:P

  5. Vijay on

    ee….ballalu….benchilu guddi em chethavule gaani……….

    aa okka prasnanu……..mee andhra nayakulanu adigi……..aa yes & no….laku anugunamga…….chesi chupinchamanu….dammunte….:P

    • chandramouli on

      పదిమందిలో సభతా సంస్కారంతో మాట్లాడం తెలియని వారలకు రాష్ట్ర్రరాజకీయాలు తెలుసునంటే…అవి భయాస్తో మాత్రమే ఉంటాయిమరి….
      …. అభీష్టసిద్దిరస్తు..

  6. Vijay on

    samaadhanam leni vallu……intha kante…..em sollu matladatharule…..[:D]…

    same to U….[:P]


Leave a reply