NRI గురివిందగింజలు …..అంటే !!!

          అస్సలు తెలంగాణా విషయం తెల్చటం కొద్దిగా కష్టమయిన పనిఅయిన నానా తంటాలు పడి నేను ఒక తీరం చేరుకోగాలిగాను. కానీ నేను తెలుసుకుంది అలానే రాస్తే చదవటం ఇబ్బంది కరం గాను బోరింగ్ గాను ఉంటుంది అని కొద్దిగా విడమరచి రాస్తున్నాను. బోరింగ్ అని ఎందుకు అన్నాను అంటే మళ్ళి కొద్దిగా రాజకీయనాయకులను తిట్టాలి, మరీ ఈ మద్యకాలం లో రాజకీయ నాయకులను తిట్టాలన్నా,వాళ్ళను తిట్టడం చూసినా చాల కంపరంగా ఫీల్ అవుతున్నారు(బహుశా రాజకీయనాయకుల ఉద్దేశ్యం అదేనేమో కాబోలు,తిట్టి తిట్టి వీళ్ళకే విసుగోచి మానేస్తారు అని ).

అస్సలు తెలంగాణా కోసం ప్రత్యక్ష పోరాటం చేసే వారి గురించి కాకా పరో్క్షంగా పోరాడేవాళ్ళు గురించి మనం ఎంతయినా తెలుసుకోవాలి …

            తెలంగాణా ఎందుకు కావాలయ్య అని ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసేవాళ్ళని (ఉద్యమించే వారిని కాదు) అడిగితే ల్యాండ్ కి మంచి గిట్టుబాటు దొరుకుతుంది అని ఒకడు, మా భాషను చూసి ఎక్కిరిస్తున్నారయ్య అని మరి ఒకడు,మా జాబ్స్ అన్ని దొబ్బుతున్నరయ్య అని ఇంకొకడు ,పేదల ఆకలి బీడు భూమి అన్న మాటలను మరీ దీనంగా మర్చి మరోకొంతమంది అంటున్నారు.వీళ్ళు అందరు ఎవరా అని ఆరాతేస్తే ఎక్కువగా మన NRI లు తగిలారు.వీళ్ళ వీరంగం లో వెబ్సైట్ లు బ్లాగ్లు ఆర్కుట్ ఫోరుమ్స్ అబ్బో అబ్బో అంతా వాళ్ళే,గురివింద చందం లాగ ఆంధ్ర నలుపు గురించి తెగ ఆవేదన చెందుతున్నారు, ఎందుకు అంటున్నాను అంటే వీళ్ళు అమెరికా తో బాటు అన్ని దేశాల వాళ్ళ options చెడగొడుతున్నాం అని తెలియదా ఏంటి వీళ్ళకు, 100$ ఇవ్వాల్సిన పనికి 10$ ఇచ్చి మన చేత పనిచేయిన్చుకుంటున్నారు అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళ కొరత వల్ల కాదు కదా!!,ఎక్కువ అడుగుతున్నారు అని వాళ్ళ జనం నోట్లో మట్టికొట్టబట్టే కదా మనకు ఇక్కడ జాబ్స్ వచ్చింది.(తరువాత గ్రీన్ కార్డు సంపాదించి మనకూడా వీళ్ళకు సమానంగా డిమాండ్ చేస్తాం అనుకోండి). అమెరిక,బ్రిటన్ జనాలు కూడా మొదలెట్టారుకదా “మా జాబ్స్ మింగుతున్నారు మీరు” అని,అంత పోటుగాళ్ళు ఆయితే ఇక్కడ జాబ్స్ వదిలేసి ఇండియా వెళ్ళమనండి చూద్దాం, ఏదో ఆర్కుట్ లో జై తెలంగాణా అంటే ఏదో దేశ సేవ చేస్తున్నాటు ఫీల్ అవుతున్నారు, పరయిదేశం లో వుంటూ ఆ దేశస్తుల ఉద్యొగావకాశాలు దోచుకున్న వీళ్ళు ఆంధ్రలో జరుగుతున్నా దానిగురించి భాదపడుతూ కధలు కవితలు website లు పెట్టి  నానగందరగోళం చెయ్యటానికి,నిస్సిగ్గుగా ఉండటం ఎంతయినా పరికించ దాగిన విషయం , చిన్నతనం నుంచి చదువు ఇప్పించిన govt కి ఏమి చెయ్యకుండా వచ్చేసిన వాళ్ళకు,ఆంధ్ర వాళ్ళు మా ఉద్యోగాలు మింగుతున్నరయ్య అని ఎలా అన భుద్ది అవుతుందో అర్ధం కావటం లేదు. 

                  ఇలానే సూటిగా ప్రశ్నిస్తే ఇంకొంచెం ముందుకుపోయి నా రాష్ట్రాన్ని బాగు చెయ్యటానికి బాగా పెద్ద కంకణం కట్టుకుని ఇక్కడకు వచ్చాను,కావాలంటే ఇదిగో కంకణం అని సమాధానం చెప్పే ప్రభుద్దులు కూడా తగిలారు నాకు. ఇక పొతే వాళ్ళు వాదించే ఇంకో విషయం ఏంటి అంటే మా భాషను వెక్కిరిస్తున్నరయ్య అని. ఎవరిని వెక్కించం చెప్పండి మనం గోదావరి యాస, కాకినాడ యాస, చిత్తూరు యాస, శ్రీకాకుళం యాస, కృష్ణలో వుండేవాళ్ళు “అండీ” అని పలకరించే విధానాన్ని.పక్కనవాడిని ఎక్కిరించంది ఎవరు చెప్పండి …( bangalore లో కన్నడవాళ్ళని  వాళ్ళని తెగ ఎక్కిరిస్తారు.. అస్సలు తెలుగుభాషకు బ్రమ్మరధం పట్టి ఈమాత్రం నిలిపింది వాళ్ళ రాజు అని తెలిసికూడా)… దాన్ని మళ్ళి satate లెవెల్ crisis లిస్టులో చూపించి నిజమయిన అవసరాలను చిన్నవి చెయ్యటం తప్ప. పక్క భాషను, పక్క మండలీకాన్ని గౌరవించలేని వాడు చదువుకున్నవాడు ఆయితే ఏముంది, పశువు ఆయితే ఏముంది (సారీ animals మాకు ఇలా మిమ్మల్ని అడ్డం పెట్టుకుని తిట్టడం అలవాటయింది . ఇలా మిమ్మల్ని మీకన్నా హినులతో పోలిస్తే భాద అని తెలుసు ..మారతాం చిన్నగా ….alternate దొరకగానే).

                 తెలంగాణకు జరిగిన అన్యాయం నీటిపంపకం,మిగిలినవన్నీ వ్యాపారుల చేతుల్లో,స్వలాభం చూసుకునే ప్రజల చేస్తుల్లో వున్నాయి తప్ప, సోల్వే చెయ్యలేనివి కాదు,ఏదో ఒక్క కారణం వల్ల ప్రత్యేక తెలంగాణా నడువదు కనుక అవికూడా తెరభాగ్యం చేసుకున్నాయి … ఈ ప్రత్యేక తెలంగాణా వల్ల ఆ పేద రైతుల గుండె మంటలు చల్లారకపోతే ఈ ఉద్యమ ఫలితం సూన్యం,సొంతలాభం తప్ప సమాజానికీ ఏమి ఒరగదు, ఒహ్! తెలంగాణా ప్రజానేతలరా మీ సహనానికి జోహార్లయ్య ..పేదరయితుల కూటికోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులరా మీ ఆశ త్వరలోనే నేరవరేతుంది . సరియయిన నాయకులని ఎన్నుకుని ప్రణాళిక భద్దంగా మంచిని,పురోభివృద్ధిని ప్రజలకు అందిస్తారు అని ఆశిస్తూ ఇలాంటి సొంతలభం చూసుకునే గురివిందలను ఒక కంట కనిపెట్టమని మనవి చేస్తూ ….ముగిస్తున్నాను

( ఉద్యమాన్ని అభాసుపలు చేస్తున్న వీళ్ళగురించి రాసినప్పుడు ..కొన్ని మాటలు నిజామయిన ఉద్యమకారులకు భాద కలిగించి ఉండిన యెడల మన్నించగలరు …. ఇలాంటి వాళ్ళు ఉద్యమం గురించి సరిగా మాట్లాడలేక ఎదుటివారిముందు ఉద్యమం గోప్పదన్నాన్ని మట్టికరిపించటం చూసి అలా రాయటం జరిగింది ….)

ఇప్పటివరకు 7 వ్యాఖ్యలు

  1. a animal on మార్చి 20, 2008

    బాగా రాసినారు, animals మన కంటే చాలా గొప్పవి. ఆంధ్ర, తెలంగాణా ఒక బండికి కట్టిన రెండు ఎద్దులు వంటివి, ఏ ఎద్దు విడిపోయినా అది బండి కాదు ఒంటి ఎద్దు బండి అవుతుందికదా!

  2. ఫజులుర్ రహమాన్ on మార్చి 20, 2008

    నేను మీతో ఈ విషయం ఫై ఏకీభవిస్తాను. తెలంగాణ వెనుకపడిన విషయం నిజమే … కాని ఇదంతా … ఆ ప్రాంత నాయకుల తప్పిదం అని మర్చిపోకూడదు … ఎందుకంటే ఆయా ప్రాంత నాయకులకు వారి వారి … కోటా కింద ప్రభుత్వం నిధులు ఇస్తుంది … ఆ నిధులన్నీ వారు ఏమి చేసినట్లు … ??

  3. ravi on మార్చి 20, 2008

    ఒరగ…కత్తి

  4. [...] తెలంగాణను సమర్ధించే కొందరు గురివింద… డొల్లతనాన్ని భువనవిజయంలో చదవండి [...]

  5. yamini on ఏప్రియల్ 2, 2008

    చాలా బావుందండీ….తెలంగాణ గురించి నిజాలు చెప్పారు…మీకు నా మంగిడీలు

  6. జిల్ జిల్ జిగ on ఏప్రియల్ 4, 2008

    meeru internet meedha search cheste ekkuva NRIs kanipistaaru. Internet is not representative of regular Telangana people. Nevertheless, the sentiment seems to be strong among Telanagaites. It has to be recognized that Telangana is relatively backward compared to some other parts of the state. And it is important to understand the reasons for this backwardness.

    Breaking the state is not a solution but might help focus attention better. Smaller states are easier to manage. But water sharing will become a nightmare. The only problem I have with the Telangana movement is it is led by KCR whom I do not trust.

  7. chandramouli on ఏప్రియల్ 5, 2008

    I have uttered the same grief as yours,but I support the telangana momement only when telangana region have honest leaders whom can fulfill the dreams of Telangana people,

    my arugument is like this, we dont allow our childs into evil hands… eventhough that evil gives gold,and diamonds first but death will be right after that…

    If People like kaloji are in the Political front I will definately support them and it is my minimum curtosy too…

    Eventhough there are the positive points if telangana seperation happens,if Leaders did have vision about the state India poverty level gains few more points.. thats my anguish….

    people dont accept that ..they say that ..lets give a try with the new state… but i wont suggest that … make the leaders first then ask for the state.. even sir.Kaloji also have belief on Pink King…thats where I am worring much …

    NRI’s are creating scene most embrassing thats why I have givemy transparent opinion on them…

Leave a reply