నా కలంలో ….శ్రీ శ్రీ సిరా …. (పేరడీ)

రాచరిక నాగరికతలో, ఆర్యులు చేర్చిన ఈ కుల సంస్కృతి నానాటికి పరిధిమించి పోతుంది. ఆకలేసిన వాడికి అన్నం పెట్టడంలో,అడుక్కునే వాడికి దానమివ్వడంలో కూడా కులం మతం చూస్తూ మానవత్వానికి దూరంగా పారిపోతున్న …ఈ సభ్యసమాజపు సగుటుని అలముకున్న నిశీధిని … సమస్వామ్యపు వెలుగులతో నింపమని …. చైతన్య కవులను వేడుకుంటూ ..ఈ కవిత .. కులనిర్మూలనకు తోత్పడే వాళ్ళందరికీ అంకితమిస్తున్నాను ..

 —–

కులాలనన్ని కలాల దున్ని,
జనావనంలో,మనో తలంలో,
నిషస్సు మండగ,ఉషస్సు నిండగ-

విచక్షణెరుగక విజృంభించి,
కులమత్తున కీచకులై,
మతమంపున సైంధవులై,
మనప్రగతికి మంటబెట్టే,
రాక్షసరూపుల కాష్టం పేర్చే,
కవి రాజుల వజ్రకలానికి,
ధర్మబలానికి సమానమంటూ,
మరేది లేదోయ్!

పదాల పదును,
ప్రయోగ సత్తువ,
నవసమాజం నిర్మించాలని,
సమసమాజం స్తాపించాలని,
ఇలలొ,కలలో,కవితల్లో,
పరిశ్రమిస్తూ,
పరిప్లవిస్తూ,
సాహిత్యానికి దాస్యం చేసే,
కులతంత్రపు కోరలు పీకే,
అక్షరవీరుల కలముల నిండా,
కణకణ మండే,గలగల పారే,
విప్లవాగ్నికి,విమర్శ ధాటికి,
పగ్గం వేశే ప్రకోపధాముడు,
ధరాన లేడోయ్..

భాష్యం చెప్పి ,చోద్యం చూసే,
గళాసురావుల,కళావరాసుల,
కుత్తుక కోసే కలములుబట్టి,
చరిత్రపేర్ఛిన,అనాది నిలిచిన,
కుల పునాది కూల్ఛే ఘంటముబట్టిన,
అక్షరనాధుల విప్లవధారలు,
ప్రతిద్వనిస్తాయి,ప్రఉజ్వలిస్తాయ్,
మనోద్యమానికి ప్రభలు కదుపుతాయ్,

నాలుగు రంగుల హైందవస్తోత్రం,
రాముడు కాచిన రాక్షస చట్టం,
కృష్టుడు కూల్చని కుతంత్ర సౌధం,
బుద్దుడు పాడిన స్వతంత్రగీతం,
మరొక్కసారి,మరొక్కసారి,
జనాలకోసం,మనోళ్ళకోసం.
సంరావిద్దాం మన హ్రుదయ మృదంగం,
అలా అలా ఎత్తిన గొంతులు,
మత్తుగ ముసిగిన మనుషులలేపే,
ప్రభాతభానుని గీతికలవుతాయ్

ఇదే !!,ఇదే !!,
నే వినిపించే,
నే విరచించే,
నవీన రీతిన స్వేచ్చాగీతిక,
నా మనసున పాడిన ప్రచండ డోలిక,
కులషోదక ఝంజాపవన మాలిక..

– చంద్ర

ఇప్పటివరకు 8 వ్యాఖ్యలు

  1. తెలుగు 'వాడి' ని on ఏప్రియల్ 4, 2008

    అధ్బుతం … మహాధ్బుతం …. చాలా చక్కగా, సూటిగా అన్వయించిన మీ ప్రతిభకు అభినందనవందనం.

  2. జిల్ జిల్ జిగ on ఏప్రియల్ 4, 2008

    I am little confused. Sri Sri wrote this poem right? And in the context of this poem what does “కాచిన” mean in రాముడు కాచిన రాక్షస చట్టం.

    Thanks for the great post.

  3. sree on ఏప్రియల్ 4, 2008

    chaala baavundandi…antha chinna maata saripodemoo…srisi gaaru annattu.
    egirinchey kaavya kabandaalani..keralinchey suptha bhujangaalanu..kula rakkasini egaraesi giraatesi..matha moudula pi garala varsham kuripinchi…aa kullina mruthadehaale yeruvulu gaa samasaamyapu sumaalu puyinchey..nava jeevana naadaalu vinipinchey…

  4. chandramouli on ఏప్రియల్ 4, 2008

    @jil jil jiga

    This is peom is a parody of sri sri’s - “Polalananni halala dunni” prasody. I took that frame and inserted my feel about castism in andhra.

    “Kaachina” ante - Protected ani meaning vastundi….

  5. జిల్ జిల్ జిగ on ఏప్రియల్ 4, 2008

    mari రాముడు కాచిన రాక్షస చట్టం means రాక్షస చట్టం protected by రాముడు. Sounds like a criticism against రాముడు. Or am I wrong? Because in the next few lines you sound like you support Krishna and Buddha.

    And what stotram were you referring to when you say నాలుగు రంగుల హైందవస్తోత్రం?

    But great experiment. Sounded like Sri Sri.

  6. chandramouli on ఏప్రియల్ 5, 2008

    పితృస్వామ్య సమాజం మొదలుకుని, బ్రాహ్మణా, క్షత్రియ,వైశ్య,సూద్రులంటూ సంఘాన్ని విడతీసిన హైందవదర్మం రాముని కాలంలోనే బలపడింది … అందువల్ల …రామయ్య దాన్నే పాటించాడు అని నా భావం …. దీన్ని చెప్పాలి అంటే .. చాలా పెద్ద కధ ..త్వరలొ.. రాక్షసులు ఎవరు అని నేను ఒక అభిప్రాయన్ని వెల్లడించబోతున్నాను …దాన్ని చదవండి… ఈ విషయంలో ఎమన్న సందేహాలు ఉంటే అప్పుడు మాట్లాడుదామ్…

    ఇక పొతే, భగవద్గీత, అన్నింటిగురించి చెప్పిందికాని…ఈ కుల గజ్జి గురించి మాత్రం మరిచింది… నేను కృష్టుడు కూల్చని అని రాశాను చూడండి…

    ఈ చాతుర్వణంని ఎదిరిస్తూ చేసిన పోరాటమే.. బుద్ద భొదన….

    — హిందువులను ముక్కలు చేస్తూ పాడిన “చాతుర్వణం మయాదత్తం” అనే స్తొత్రం హిందువులకు తారక మంత్రం… బ్రాహ్మణా, క్షత్రియ,వైశ్య,సూద్రులంటూ సంఘాన్ని విడతీసిన హైందవదర్మం…. అక్కడే మొదలయింది మొదటి కుల గజ్జి ……. కాక పొతే అది ఆ సమాజానికి అవసరం … వృత్తిపర సమాజం కనుక.. అది అవసరమయి ఉండోచ్చు.. కాని … ఈ కాలానికి అవి చెల్లవు…. అవి కూడా పైన చెప్పిన వ్యాసం లొ చూడగలరు….

  7. జిల్ జిల్ జిగ on ఏప్రియల్ 5, 2008

    Thank you for your reply. I will watch out for your future post.

  8. కొత్తపాళీ on ఏప్రియల్ 23, 2008

    భావం సంగతి ప్రస్తుతం చెప్పలేను గానీ నడకని మాత్రం గతి తప్పకుండా పట్టుకున్నారు. అభినందనలు.

Leave a reply