అగ్నిస్కలన - ఛత్రపతి
ఎందుకో ఈరోజు ఈ పాట గుర్తొచ్చింది ….ఒక సారీ సాహిత్యం కోసం అంతర్జాలం లో గాలించా … దొరక్క నేనే విని రాసాను .. ఎవరికన్న తప్పులు కనిపిస్తే చెప్పరూ ….
అగ్నిస్కలన సందర్ధరిపు వర్గప్రళయ రధ ఛత్రపతి
మధ్యందిన సముధ్యద్ కిరణ విధ్యుధ్యమని ఖని ఛత్రపతి
తజ్జణ్ తజను తధింధిరన ధింధింతకిట నట ఛత్రపతి
ఉర్వీవలయ సంభావ్యవర స్వచ్చందగుణధీ
కుంభీనిగర కుంభస్త గురు కుంభీవలయ పతి ఛత్రపతి
ఝంఝాపవన గర్వాపహర వింద్ధ్యాద్రి సమ ధృతి ఛత్రపతి
చండప్రభల దోర్దండజిత దూర్దండ బట పతి ఛత్రపతి
శతృప్రభల విచ్చేదకర భీమార్జున ప్రతి
ధిగ్ధిగ్విజయ ఢంకానినద ఘంటారవపు షిత ఛత్రపతి
సంఘస్వజన విద్రోహిగణ విద్వంశమత మతి ఛత్రపతి
ఆర్తత్రాణ దుశ్టద్యుమ్న క్షాత్రస్పూర్థి ధీధిధిధీమక్ష్మాపతి శిక్షాస్మృతి .. స్తపతి
ఇప్పటివరకు 10 వ్యాఖ్యలు
Leave a reply
మంచి పాటే!బాగా ఊపులో ఉంటుంది.
కీరవాణి గారి చేతి చలవ కింద లింకులో చూడండి?!
http://www.youtube.com/watch?v=oZ8qxskcISE
ఈ సినిమా చూసినప్పుడు నాకు ఈ పాట చాలా నచ్చింది .. అంటే కేవలం పాట గా కాక, సినిమాలో వివిధ సీన్లలో బేగ్రౌండుగా ఉపయోగించుకున్న తీరు చాలా నచ్చింది. కానీ తరవాత దీని ఒరిజన్ల్ సౌండు ఏదో జెర్మను రికార్డు అని తెలిసి కొంచెం అసహ్యం వేసింది, మరీ ఇంత ఎంగిలి నాకుడు అవసరమా అని. ఇంచుమించు ఇలాంటిదే రాజమౌళి సింహాద్రిలోనూ (ఒక తమిళ జానపద జాతర గీతం), ఇటీవల యమదొంగలోనూ చేశాడు.
సారీ .. సాహిత్యం తప్పొప్పులు విషయంలో నేనేం చెప్పలేను.
అదేంటో… నాకు మీ పొస్టూ నచ్చింది, కొత్త పాళీ గారి కామెంటూ నచ్చింది. బాణీ కాపీనే కానీ.. పాపం ఆ బాణీలో ఇరికిన తెలుగు పదాలు.. బావున్నాయి. పాడిన వాళ్ళూ బాగా పాడేరు.
ఇంతకీ ఏసినిమాలోదండి ఈ కీర్తన??
నేను “ఒకరికి ఒకరు” సినిమా సంగీతం విన్న తరువాత కీరవాణి అభిమానినయ్యాను. ఈ పాట విన్నాక అభిమానం పెరిగింది. కానీ ఇదే కాదు ఇంకా చాలా పాటల ట్యూన్ లు కాపీ అని తెలిసి బాధపడ్డాను. ఇప్పుడైతే “ఒకరికి ఒకరు” సంగీతం కూడా కాపీనా అనే సందేహం వస్తోంది.
కీరవాణి కూర్చిన పాటల్లో సగానికి మూడొంతులు కాపీలే! ‘కీరవాణి కాపీ రాగాలు ‘ అని టపా రాయాలెప్పుడో! క్రిమినల్ సినిమాలో ‘తెలుసా మనసా ‘ పాట కి ముందు వచ్చే హమ్మింగ్ (ఆలాపన) ఎంత బాగుంటుంది? అది విని నిజంగా కీరవాణి దగ్గర కొద్దో గొప్పో పాండిత్యం ఉందనుకున్నాను.
కానీ ఖర్మ గాలి ఆ తర్వాత షరాన్ స్టొన్ నటించిన sliver సినిమా చూడ్డం జరిగింది. ఆ సినిమా టైటిల్స్ అప్పుడు ఈ ఆలాపన వస్తూ ఉంటుంది బాక్ గ్రౌండ్ లో! శుద్ధ కాపీ! ఇలాగే బోల్డన్ని పట్టుకోవచ్చు.
అసలు ఈ సాహిత్యం చూస్తే ఇది ఏ శివుడో తాండవం చేయడానికి రాయించుకున్న పాటలా ఉంది.
ఇంతకూ దీని ఈ గీతానికి అర్థం చెప్పగల ధీరులు ఎవ్వరైనా ఉన్నారా?
సాహిత్యానికి, అర్థానికి ఇక్కడ చూడండి:
http://chitrageetasaahityamu.blogspot.com/2008/08/blog-post.html
శ్రీ గారు,
కొత్తపాళీ గారు ,
రాజేంద్ర గారు,
రవీంద్ర గారు,
సుజాత గారు ,
మరోక సుజాతగారు,
రాఘవ గారు,
అందరికి నా నెనర్లు …
నవీన్ గారు మీకు సమాధానం దొరికిందనుకుంటున్నాను …
నెనర్లు