ఎంటో ఈ పిచ్చి…. నిజంగా మతంకోసమేనంటారా ఇవన్నీ ??
అస్సలు మతం-మనిషి-అబిరుచి వీటన్నిటి గురించి మొత్తంగా ఒక టపా వ్రాయాలని అనుకుంటూనే వున్నాను కానీ ఎప్పుడూ అంతబాగా అనిపించలేదు కాని … ఈ మద్య నేను అబిమనించే మంచి అలోచనా పరులు (బ్లాగర్లలో )… కూడ తమమీద కప్పుకున్న మంచి అనే గొంగళి తీసేసి తమ తమ ఆంత్: స్వరూపాలు చూపించే సరికి ఈ టపా ఖచ్చితంగా వ్రాయాలనిపింఛింది…..
మతం – నా అలోచెనలు …
రాతి గుహలనుంచి పాలరాతి గ్రుహాలవరకు మనిషి చేసిన పయనానికి దోహదం చేసిన కారణాలలొ మతం యొక్క పాత్రను ( అనగరిక,అమానవీయ ఆచారలను పక్కనబెట్టి), ఈ కాలపు మతోన్మాదన్ని నిష్పాక్షికంగ పరిశీలీస్తే బొలెడు విషయాలు నాకు స్పురించాయి ….
బైబిల్ , బైబిల్++(అదేనండి బాబు ఖురాన్), గీత , వేదాలు , త్రిపీటకాలు(భుద్దిజం) ఇవి ఏవి,ఏమి చెప్పిన సమాజ ఔన్నత్యాంకోసం ఆ దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా తత్వవేత్తలు రాసినవి ….వాటిలో కొన్ని అవాంచనీయాలు వుండొచ్చు …
ఉదాహరణకు :
మహమ్మదీయుల్లో —
ఇస్లాం మతం స్వీకరించి మరల తన పాతమతానికి వెళ్ళిన వాడిని చంపు అని ఒక షరియా వుంది .. నా మటుక్కి నేను దాన్ని ఒక ముందస్తు హెచ్చరికలా చూస్తాను … అంటే ఆ మతంలో వున్న లొసుగులు వాడుకొవడంకోసమే(ఉదా: అధికారిక బహుభార్యత్వం) వచ్చేవారికి అది అడ్డుగోడ అవుతుంది … అదీకాక ఇస్లాం మతమార్పిడి కన్నా తన పరివారన్ని పెంచుకుని మతవ్యాప్తి చెయ్యటానికి ఇష్టపడుతుంది కాబట్టి అలాంటి అమానవీయ వాక్యాలు కనబడుతుంటాయి ……
క్రైస్తవుల్లో :
ఆదివారం దేవునికి కేటాయించని వారిని నిస్సందేహంగా చంపమని చెబుతుంది క్రైస్తవ మతం ….(ఇది ఎంతవరకు పాటిస్తున్నరు అనేది ఇక్కడ ప్రశ్న కాదు) అంటే క్రైస్తవ మతాన్ని పాటిస్తున్న ఆనాటి(క్రీస్తు శకం మొదటి వంద సంవత్సరాలు )సమాజనికి మార్గ దర్శకులు, దార్శనికులు వారి వారి క్రీస్తు మత ప్రభొదకులు ( చర్చ్ ఫాదర్ ) మాత్రమే కనుక ప్రతి ఒక్కరు వారంలో వారి సమాజ పునరుద్దరణకు, వారి భవిష్య ప్రణాలికలో భాగస్తులను చెయటానికి మరియు అప్పుడప్పుడే చివురిస్తున్న క్రీస్తు మత స్తిరత్వానికి అలాంటి అధికరణ సమంజసమే (ఆ కాలం వారికి )……
హిందువుల్లో :
నాకు తెలిసి హిందువుల్లొ ఫలానవి పాటించనివాడిని చంపేయండి అని ఎక్కడా లేదు కాని…. వేద బాహ్యులయిన వారిని చండాలురిగా గుర్తించి సమజ భహిష్క్రుతులను చేసి వారి సాంగత్యము పాఫముగా నిర్దారించ బడినది …. .. ( స్వాతంత్రనంతర కాలంలో కూడా ఈ వెలివేయటం మనం విన్నాం)… వారికి పునహ్ స్వాగత మార్గలు చెప్పక పోవటం ఒక విధంగా లోపంలా కనబడినప్పటికి … అలా వేలివేయ బడటం భయంకరమయినది ..దానికి నివారణోపాయం వుండదు అన్న భయం వారి సమాజీకుణ్ణి కర్మభ్రష్టులను కానివ్వకుండా ఉంచుతుంది అని అలాంటి నిర్దయాపూరిత వాక్యాలు వ్రాయటం జరిగింది …
ఇది దారుణం ….
మన సౌఖ్యం కోసం అంతటి దారుణాల అంటే …
సమాధనంగా … సరే ప్రత్యామ్న్యాలు ఇచ్చారు అనుకుందాం ….. మనం వాటిని ఎంత పవిత్రం గా చూస్తామో …. రాజ్యాంగం …ఇండియన్ పీనల్ కోడ్ గురించి తెసిలిన వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పనవసరం రాదు …..ఆ కాలం వారికి మతగ్రంధాలే అన్నీ …. రాజకీయప్రాదికల వద్దనుంచి పండగ ప్రణాళికలవరకు ఆ మతగ్రంధాలనే అష్రయిస్తారుకదా మరి అవి అలానే వూండాలి ….
మరి మానవతా విలువలో ….. జీవించే హక్కు .. ( ఆర్టికల్ ఇరువది ఒకటి ) …. దాని గురించి మతం చెప్పటం లేదా ….
( తరువాతి టపాలో …….)
9 comments so far
Leave a reply
మంచి టాపిక్కు, ఇంకా కత్తులు కటార్లు రాలేదా.
> ఆదివారం దేవునికి కేటాయించని వారిని నిస్సందేహంగా చంపమని చెబుతుంది క్రైస్తవ మతం …
క్షమించాలి,ఆదివారం దేవునికి కేటాయించని వారిని నిస్సందేహంగా చంపమని క్రైస్తవ మతం బైబిలు లొ ఎక్కడ చెప్పలేదండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్దంగా ఆచరించమని దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఙలలొ ఒకటి. మీరు ఇది బైబిలులొ ఎక్కడ చదివారో చెప్పగలరా ?
సౌజన్య
good
గురూజీ,
మీ మిగితా టపాకై ఎదురు చూస్తూ ఉంటాను, అంతలోపల మీ ఈ టపాకు స్ఫూర్తినిచ్చిన ఆ టపాలను ప్రస్తావిస్తే నా వంతు సాయంగా నేను చదివోస్తాను వాటిని. తప్పును తప్పు అని చెప్పకపోవటం కూడా తప్పే కదా అందుకని ఆ టాపాల links ఇవ్వండి.
Exodus 35:2 God demands that we kill everyone who works on the sabbath day.
Deuteronomy 21:18-21 God demands that wwe kill disobedient teenagers
Leviticus 20:13 God demands the death of homosexuals
Deuteronomy 22:13- 21 God demands that we kill girls who are not virgins when they marry
@ సౌజన్య గారు
ఆదివారం దేవునికి కేటాయించని వారి అనేది వాడుక భాషలో చెప్పబడినది ( నేను వెళ్ళే ఒక చర్చిలో)….
నేను పై కామెంట్లో నాకు గుర్తున్నమటుక్కి ఇచ్చాను…. ఇలాంటివి బోలెడు ఉన్నాయి .. రాళ్ళతో కొట్టి చంపటం …శిలువవెయ్యటం….వగయిరా వగయిరా…
దయచేసి ఇక్కడ గమనించగలరు …నేను మతసంభంద పుస్తకాలలో తప్పులెంచటం లేదు …. వాటి అవసరం …. వాటి వెనుక దాగిన నిర్మాణాత్మక ద్రుష్టిని చూపుతున్నను …
దరిమిలా …. ఈ కాలంలో వాటిని ఎలా పాటించాలి అనేదాన్ని విశ్లేషిస్తున్నాను … మీ భావలు ఆక్షేపించ బడినటుల మీరు భావించిన యెడల క్షంతవ్యుడను ….
భావకుడన్ :
అన్నిటిలో చక్కగా ఆలోఛించే పర్ణశాల మహేష్ గారు …వారి టపాలన్న వారి అలోచెనలన్నా నాకు చాల అబిమానం …..
కాని…. ఉద్యోగం మారిదంతే అన్న టపాకూడా చాలా బాగా రాశారు …..ఆహా అనుకున్నంతలో … మీరు మతం ఎందుకు మారలేదు అన్న ప్రశ్నకు … సమాధనంగా నాకు డబ్బులు మంచి పదవి ఇస్తే చాలు … క్రైస్తవ మతానికి వీర సేవ చేస్తాను ( ఇంకా నీచంగా చెప్పొచ్చు…కానీ గౌరవార్దం …అలా చెప్పలేకపోయాను ) … అన్ని ఉగ్గడించారు …. ఆ మాట చూసినంతనే …
ఆశేతుహిమాచలం ఆ బ్రిటీష్ సామ్రాజ్యవాద పాదలకింద నలగటానికి ఇలాంటి వారే కారణం కాబోలు ..తెలివైనవారు .. ధైర్యస్తులు ….. మంచి అలోచెనా పరులు … వెధవ డబ్బుకోసం అర్రులు చాచబట్టికదా …. అన్ని వేల సంవత్సారాలు ( తుర్క్స్ & బ్రిటీష్) పరాయి పాలానలో బతికి … వసుధైక కుటుంబమ శ్రేయ్యస్సు కోసం అలోచించే భారతీయులు …దినబత్తేంకోసం దేబురించే స్తాయికి పడిపోవాటానికి కారణం ఇలాంటి ఫిరాయింపులే అనుకుంటున్నాను …..
@Siva @ yavana gaaru
నెనర్లు
@చంద్రమౌళి; నా పేరు చెప్పిమరీ నా వ్యాఖ్యను ఉదహరించారు కాబట్టి ఇక్కడ రాయవలసి వస్తోంది.నేను మతం ఎందుకు మారలేదు అన్నదానికి నేనిచ్చిన సమాధానంలో నేను వాడిన భాషని మీఋ మరొక్కసారి చదవగలరు.
అయినా “వెధవ డబ్బు” అని మీరన్నంత సులభంకాదు నిజాన్ని జీవించడం. ముఖ్యంగా మతమార్పిడుల నేపధ్యంలో అసలు కాదు.
ఇక తుర్క్స్&బ్రిటిష్ కాలంలో డబ్బులకోసం అర్రులుచాచి దాస్యం చేసినవారెవరో మీరు కాస్త చరిత్ర తిరగేసి చూడండి. ఇక భారతీయులు వసుధైవకుటుంబకం అనుకున్నది, అసలు ప్రపంచం ఎంత పెద్దదో తెలియనప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆదర్శం భుక్తి/దినబత్తెమే అది మల్టీనేషనల్ కంపెనీ అయినా లేక మరేదైనా.ఇక కండుపునిండిన వారు మాట్లాడే హిందూమత మహత్తు చాలా మందికి అనవసరమైన ఝంజాటంతప్ప మరొటి కాదు.