మతప్రాతిపదిక మీద రిజర్వేషన్లు – మత మార్పిడులు – ఓటు బ్యాంక్ రాజకీయాలు

చలం గారు అన్నట్టు కొత్తతరం వేసే సహేతుక ప్రశ్నావళికి దద్దరిల్లిన పెద్దరికం పిన్నలు ప్రశ్నించటాన్నే అనాచరంగా మార్చివేసింది అని – అలా చలం గారి మాటను పూర్తిగా నిజం చెయ్యకుండా ఈ కాలంలో ఎంతోమంది తమ తమ విశాల ద్రుక్పధాన్ని చూపుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను …నేను సందేహాల పుట్టని – అందులోంచి ఒక సందేహం ….

స్వాతంత్రానంతర సమాజ పరిస్థితిని ద్రుష్టిలో ఉంచుకుని ప్రతిపాదించిన ఈ రిజర్వేషన్లు అందరికి చిరపరిచితమే. హిందువులలో నిమ్నకులాలుగ,అతి సూద్రులుగా పరిగణింపబడుతున్న జన బాహుళ్యనికి చేయూతనివ్వడంకోసం అందించిన ఈ రిజర్వేషన్ అంటే నాకు మొదటినుంచి మంచి అభిప్రాయమే వుందికనుక (కొన్ని కీలకమయిన చదువులకు పదవులకు సంభందించిన రిజర్వేషన్లు తప్ప – వాటికి కులం మతంకన్నా సత్తా ముఖ్యం అని నా వుద్దేస్యం) వాటి గతి గురించి నేను ప్రశ్నించను కానీ మత మార్పిడి చేసుకుని కూడా ఇంకా పాత మతం తాలుకా లాభాలను ఇంకా పోందుతున్న వారు , అలాంటి లోపాన్ని సరిదిద్దని ప్రభుత్వము మీదా నా ప్రశ్న ..

మతమార్పిడి మీదా నాకు ఒకింత (భావ స్వేచ్చ ద్రుష్ట్య)గౌరవం వున్నప్పటికి మతమార్పిడికి దోహదం చేస్తున్నవారు, మార్చుకుంటున్నవారి మూలాలు, ప్రాతిపదికలు చూసి చూసి దానిమీద గౌరవం సన్నగిల్లుతుంది.ఇకపోతే నా ప్రశ్న ఎంటి అంటే- హిందూ నిమ్న జనోద్దరణకు సమీకరించబడిన రిజర్వేషన్లు ఇలా మతం మార్చుకున్నా వారికి ఎలా వర్తింప జేస్తున్నారు – పక్క మతస్తుల ప్రసాదన్ని ముట్టుకోవటం మహాపాపం(బైబిల్ ద్రూష్ట్య) అని చెబుతున్న మత ప్రభోదకులు ఇలా పక్క మతస్తులకు కేటాయించిన ఫలాన్ని దోచుకోవద్దని ఏ మత ప్రభోదకులు చెప్పరెందుకు …

తమ జన్మతహ సిద్దించిన మతంలో దొరకని సామజిక గౌరవం చేయూత పక్కమతంలో దొరుకుతుందని ఆశిస్తూ పక్క మతాన్ని స్వీకరిస్తున్న వారి కొత్త జీవన సరళిని చూచిన మీదట, వారి భవాలను దగ్గరగ పలిశీలించిన మీదట వారు అశింఛిన ఫలితం దక్కింది అనుకుంటున్నాను.

రాజ్యంగ భద్దంగా ఆలోచించినా కూడ వారికి కొన్ని సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వమని కదా నిభందన. అంటే రిజర్వేషన్లు కల్పించబడిన సమయంలో వారు జీవన స్థితిగతులు మెరుగు పడతాయి కనుక వారికి ప్రత్యేక రాయితీ అవసరం ఉండదు అని వారి యోచన. మతం మార్చుకుని వారు అతి తక్కువ కాల పరిమితిలోనే రాజ్యంగం కోరిన విధంగా మెరుగయిన జీవన స్థితిని చేరుకుంటున్నారు కదా …

ఇలా మతమార్పిడికి లోనయిన వారికి కేటాయించిన మొత్తం దుర్వినియోగం అవుతుంది అని నా అభిప్రాయం . దీన్ని అరికట్టి సరిగా వినియొగించటం …సాద్య పడదా ??

6 comments so far

  1. పెదరాయ్డు on

    వాళ్ళు కేవలం మతం మాత్రమే మార్చుకున్నారు. కులం మార్చుకోలేదుగా?
    మతం మార్చుకునేది మెరుగైన జీవితం కోసం. కులం మార్చుకోనిదీ అందుకే.
    హిందూ మతంలో అతి జుగుప్సాకరమైన కుల వ్యవస్తను నిర్మూలించక పోవటం వల్లే వాళ్ళు మతం మారారు. కాని రిజర్వేషన్ల ద్వారా కలిగే సామాజిక అభివృద్దికోసం, కులాన్ని విడిచిపెట్టకుండా త్యాగం చేస్తున్నారు(సోనియా ప్రదాని పదవి త్యాగం చేసినట్లు).

    వీటి అర్థం పరమార్థం ఒక్కటే, స్వార్థం. తనకు కలిగిన నష్టానికి కులవ్యవస్తను ఏకిపారేసి మతం మార్చిన వాళ్ళే ఉద్యోగానికీ ఇతర సామాజిక అవసరాలకూ నిస్సిగ్గుగా కులాన్ని చాటుకోవటం. రిజర్వేషన్ల ద్వారా చదువుకొని, ఉద్యోగం సంపాదించి, ప్రమోషన్లు కొట్టేసి, మళ్ళీ తన పిల్లలకోసం అదే రిజర్వేషన్లను ఉపయోగించడం. వీరు సదరు అగ్రవర్ణ దురహంకారులకంటే ఎలా ఉత్తములు. అగ్రవర్ణాల వారికంటే, బడుగు వర్గాల్లోని ఇటువంటి వారి వల్లే అధిక నష్టం.

  2. chaanakya on

    maa kulam anichivethaku guraindhi antunnare gaani matham maarithe kulame maarcheyatam anedhi agrakula vaari anichivethane chebutundhi.maa mathamlo vundaali ee kulam maatrm paiki edagakoodadu,anntlu vundhi mee maata.

  3. నాగన్న on

    సామాజిక గౌరవం దొరక్క మతం మారుతున్నారు అని నేను అనుకోను. అన్ని కులాల నుండి మతం మారిన వారు ఉన్నారు. ఎవరికి వారు ఏదో ఒక లాభం ఆశించే మారతారు. ఏ మతం నుండి ఏ మతంలోనికి మారినా కాసులు లేనిదే నేటి సమాజంలో గౌరవం దొరకడం కష్టమే అనుకుంటాను.

  4. తాడేపల్లి on

    “….హిందూ మతంలో అతి జుగుప్సాకరమైన కుల వ్యవస్త…..”

    పెదరాయ్డుగారూ ! కులాలు, వర్గాలూ, జాతులూ, తెగలూ, శాఖలూ, నేషన్సు, సబ్ నేషన్సు – ఇలాంటివి ఎప్పటికీ ఏర్పడకుండా నిరోధించగల మంత్రదండం మీ దగ్గరేమైనా ఉందా ?
    లేనప్పుడు మనం కులానికి వ్యతిరెకంగా మాట్లాడి సాధించేదేముంది ? ఇలా మాట్లాడినవారు ఇప్పటి దాకా ఏం సాధించారు ?

  5. పెదరాయ్డు on

    తాడేపల్లి గారూ…ఇది నేనన్నది కాదు. కులాలకు వ్యతిరేకంగా కొందరు గతంలో వాదించినదాన్ని ఉదహరించాను.

  6. K.P.Sukumaran on

    Best wishes


Leave a reply