సాహిత్య అధారిత సినిమాలు: ఒక పరిశీలన

తెలుగు సాహిత్యం గురించి క్లుప్తంగా…..

          ’చదివేవారు ఉంటే మంచి రచనలు చేస్తా’ అని రచయితలు రాయటంలేదో, ’మంచి రచనలు (వారి వారి అభిరుచికి తగ్గట్టు) తెలుగులో వుంటే చదవటానికి మాకేం’ అని పాఠకులు మానారో అర్దంకాని పరిస్తితి ఇది. ఈ దశకంలో రచయితలకు , పాఠకులకు మధ్య సదావగాహన లోపించిందేమో అని నాకు అనిపిస్తుంది్,నేను పుస్తక పఠనం హాబీగా మలచుకుంటున్న సమయంలో మంచి పుస్తకాలు చదువుదామని నేను వెతకటం మెదలుపెట్టాను,తెలుగుమీది మక్కువతో తెలుగులో మంచి పుస్తకాలకోసం పలువరను కదిలిస్తే అన్ని ౮౦ వ దశాకానికి అటు ఇటుగా వచ్చినవే గాని ఈ మద్యకాలంలో వచ్చిన పుస్తకాల్లో ఒక్క పుస్తకాన్ని కూడా ఎవ్వరూ చదవమని చెప్పకపోవటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అడపాదడపా అనువాదలు, ప్రేరణ పొందినవి , అలా ముద్రపడినవి (యండమూరి) ఎవో కొన్ని వున్నప్పటికి కొత్తవారిని ఆకర్షించి చదివించేవి ఈ దశకంలో లేవనే చెప్పవచ్చేమో…

            డిటిక్టెవ్ నవలలు రాణిస్తున్న యుగంలో తెలుగు రచయితలు – పాఠకుల ట్రెండుకు తగ్గట్టు వ్యవహరించారు…పాఠకులుకూడా ఆదరించారు.. గట్టిగా చెప్పాలి అంటే కొత్తవారు ఆ త్రిల్ కోసం చదవటం మెదలెట్టరు అని చెప్పొచ్చేమో. అలాంటి సహ్రుద్ బావం మరియు ప్రస్తుత సమాజ నాడిని పట్టి రచనలు చేసే  రచయితల సమూహం ఈనాటి జన బాహుళ్యానికి దూరంగా ఉంది అని చెప్పోచ్చు. అలాగే భాషా పరంగా అధునికీ కరణలు జరుగుతున్న సూచనలు ఏమాత్రం కనిపించటం లేదన్నన్ని సత్యదూరం కాని విషయం.

         “కిరణ్” గారు తన బ్లాగులో విశ్లేషించినట్టు ’సాహిత్య యెద్దడి ప్రభావం’ చాలా ఎక్కువగానే ఉంది. ఇది రచయితలకు , పాఠకులకు మధ్య అగాధాన్ని ఏర్పరిచింది. దీనిలో పెద్దల పాత్ర చర్చించ దగిన అంశం, వారి(పెద్దల) సమకాలీన సాహిత్యం పై నిరాదరణ,ఆ సాహిత్యంలో ఆకర్షణ లేమి,  వారి పిల్లలను పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమయితమయ్యేలా చేసింది. ఇది మధ్య తరగతి కుంటుంబాలలో ఎక్కువగా ఉంది. తెలుగు జనభాలో సింహభాగం మధ్యతరగతి వారే కనుక ఈ అఘాధం మరీ పెద్దదిగా ఉంది. అలాగే పెరిగిన సామాజిక అసమానతలు ధనార్జనే జీవిత ధ్యేయం దానికి చదువొక్కటే మార్గం అన్న భావన (మా) మధ్యతరగతి వారిలో పాతుకుపోయిన భావన. కనుక ఆదివారం కూడా ప్రభుత్వ గ్రంధాలయం కన్నా లెక్కల మాష్టారి ఇల్లు కిక్కిరిసి ఉంటుంది. ఇలా పాఠకుల సంఖ్య తగ్గే కొంది, రచయితల అర్దిక స్తితి, అలాగే రచనల సంఖ్య గణనీయంగా తగ్గటానికి హేతువు అయి వుండవచ్చు. ఈకాలంలో ధనవంతుల పిల్లగురించి ఇక్కడ కొద్దిగా రాయాలి, వీరిలో ఎక్కువ శాతం మంది తెలుగు మాట్లాడగలరు కాని,తెలుగు చదవటం రాదు (తల్లి దండ్రులు నేర్ప(రు)టానికి ఇష్టపడరు). కనుక ఇంగ్లీషు సాహిత్యం నడుస్తూ ఉంటుంది.వీరికి తెలుగు మీద మక్కువ వున్న దృశ్యకావ్యాలకు , శ్రవణానందానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ముద్రణలు అన్ని ప్రాంతాలకు అందకపోవడం, చదవాలనుకున్న వారందరకి పుస్తకాలు చేరక పోవడం వల్ల కూడ కొందరు పాఠకులు తగ్గిపోతున్నారు.(ఇప్పుడిప్పుడే ఈ కొరత తీరుతుందనిపిస్తుంది  ఏ వి యఫ్ కే దయవల్ల )

         ఒక్కమాటలో తెలుసు సాహితీ స్రవంతి యొక్క ఒరవడి తగ్గిందని,తద్ ప్రభావాని గుర్తెరిగి, మనుషుల ఆలోచనలు, రచయితల సిరాలు ఆ ఒరవడిని పెంచేందుకు దోహద పరచాలని కోరుకుందాం…మన వంతుగా మంచి పుస్తకాలు సాధ్యమయినంతవరకు చదువుదాం…..కొనుక్కుని … కొనలేని వారికి(భాధ్యతలెరిగినవారికి)…మన పుస్తకాలు అరువిద్దాం…….
                                                         ——–{}———
         ఇక తెలుగు సాహిత్యం ఆధారంగా సినిమాలు ఎందుకు రావటం లేదు అంటే,ఈ విషయంతో నేను పూర్తిగా ఏకీ భవించలేను, నా వుద్దేశ్యంలో పుస్తకాలు ప్రత్యక్షంగా తెలుగు తెరకు ఉపయోగ పడకపోయిన పరోక్షంగా ఉపయోగ పడుతున్నాయి అనుకొవచ్చు.మచ్చుకు, తెలుగు సినిమాల్లో పౌరాణిక సినిమాలు ఒకింత ఎక్కువే. అవన్ని పుస్తకమాలనుంచి రాలిన పుష్పాలే కదా, పాత సినిమాల్లో పాత్రలు సమకాలీన నవలాపాత్రలు ప్రతిబింబాలు కావు అని చెప్పటం సమర్దనీయం కాదు. సాహిత్య ఆధారిత సినిమాలు సాహిత్యానికి ఒక విధంగా గీటు రాయి అన్న భావన వల్ల మనకు ఈ కొరత ఎక్కువ గానే కనిపిస్తుంది.కాని తెలుగు సినిమా కాలమాన పరిస్తితులకు లోబడి, తెలుసు సాహిత్య యెద్దడిని పరిగణలోకి తీసుకుని చూసినట్టయితే తెలుగు సినమాల్లో సాహిత్యం ఆధారంగా నిర్మించినవి లేక పోవటం ఆశ్చర్యపరచక పోవచ్చు.

          తెలుసు సినిమా దర్శకుల్లో ఆదుర్తి సుబ్బారావు గారు అంటే నాకు అపార అభిమానం, ఆలాంటి దార్శనికులు, తెలుగు సినిమా సమకాలీన పరిధిని దాటి అప్పటిలోనే గొప్ప సినిమాలు తీసారు, అలా ఆలోచించి తీసే వారి సంఖ్యాలేమి మన తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఉదాహరణకు: అతని మరో ప్రపంచం, ఠాగూర్ సినిమాకు తాత లాంటిది అని చెప్పోచ్చు. అక్కినేని వారు కధానయకుడయితే, ఏసు క్రీస్తు,సాయిబాబ పాత్రలతో అంధ్రుల అభిమానపాత్రుడయిన కరుణాకర్ రెడ్డి(పేరు కరక్టేనా?) ఠాగూర్, అంటే సినిమాలో చంపటం కాన్సెప్టు కాదులేంది. సినిమా ఊసే వేరు. చూడకపోతే తప్పక చూడండి, పాత తెలుగు సినిమా నచ్చని వారికి ఈ సినిమా చూపిస్తే కొద్దిలో కొద్ది గౌరవమయిన కలగచ్చు. అస్సలు సుబ్బరావు గారి గురించి ఎందుకు చెప్పాను అంటే,  ఇతని సినిమాల్లో సమకాలీన నవలలు, అప్పటి నవతరం భావాలు, సంసృతి వంటివి కనబడుతాయి.అవి సమకాలీన నవలలనుంచి,అందు బాటులో ఉన్న సాహిత్యం నుంచి క్లుప్తపరిశిలనతో పరిగ్రహించబడినవే, అంటే సినిమా తయారీలో నవలలు దారి దీపాల్లా ఉపయోగ పడ్డాయి అని చెప్పవచ్చు.

          సాహిత్య ఆధారిత సినిమాలు రాకపోవడానికి, అస్సలు సర్వజనరంజక సినిమాలు రాక పోవడానికి ముఖ్యకారణం ఫార్ములా అధారిత సినిమాలు. ఇవి ప్రేక్షకులను వర్గాలుగా చీల్చి, ఫలానా వర్గానికి చేరటానికి ఈ సినిమాతీస్తున్నమ్ అని ఆ సినిమా కర్తల చేతనే  భహిరంగంగా ప్రకటించే స్తాయికి చేరాయి. వాటికి ఆనందకర మయిన ఆదరణ లేక పోలేదనుకోండి. దీన్ని బట్టి సినిమా పునాది పడకముందే వారు ఫాలానా వర్గానికి సినిమాచేరాలి అని సంసిద్దమవుతున్నట్టు, దాని ప్రాతి పదిక మీదనే సినిమా బృందం సమీకరించ బడుతున్నటు తెలుస్తుంది. ఆ వర్గాలు అన్ని మన తెలుగులో వున్న ప్రశస్త సాహిత్యంతో  భేదించేవే(కన్యాశుల్కం,చివరికి మిగిలేది ఉదాహరణగా), కనుక అలాంటి సినిమాలు రాక పోవటం సవ్యమే. మరొక్క విషయమేంటీ అంటే ఆత్మనింద, మా తెలుగు సినిమాలు మహా దగుల్బాజీ సినిమాలు అన్న ఉద్దేశ్యంతో చూసినా, తీసేవారు మా తెలుగు ప్రేక్షకులు పరమ సుంఠలు అన్నట్టు తీసినా తదుపరి తెలుగు సినిమా ప్రపంచ మనుగడ ఈ పార్ములా పట్టాల మీదనే నడుస్తుంది అన్నది తూర్పున సూర్యుడుదయిస్తాడన్నంత నిజం. ఇరువయిపుల మార్పు సమంగా జరగాలి మరి…..

          చివరిగా, సినిమారంగం- ఉన్నతవిధ్యాధికులు, తెలుగు సినిమారంగంలో సాలీన విధ్యాధికులు ఎంత మంది ఉన్నారు (డిగ్రీ పట్టాలు అని కాదు, ఆ పట్టాకి ఎంత సత్తా ఉంది అన్నది విషయం). వారి చదువు (విద్య వల్ల కలిగిన వివేకం) ఎంత వరకు వారి సినిమాలకు ఉపయోగ పడుతుంది. ఇలా అడగ్గానే కొన్ని గడుసు ప్రశ్నలు తలెత్త వచ్చు తెలుగు సినిమాల్లో హిట్స్ ఇచ్చిన వారు అందరూ ఏమి చదువుకున్నారు అని (ఈ ప్రశ్నకు వారి వారి శైలో మారచ్చు).దానికి నా ప్రత్య్త్తుత్తరం: వారు కొంత పురోగతి సాధించారు, మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాళి, కేవలం సొంత నేర్పుతోనే అంత చేస్తే చదువుకున్నోడు ఎంత చేయ్యొచ్చు అని నా సమాధనం.ఇలా కాక, నేను  చదువుకున్నాను, డిగ్రీ వచ్చింది,దాని దాపుతో ఉద్యోగం వచ్చింది ఇంతే చదువు అని బావన ఉండే వారికి, నాదగ్గర సమాధానం లేదు. చదువు వల్ల పరిశీలన శక్తీ, సమస్యలను స్పృసించే  కోణాలు, ప్రపంచ పరిశీలన,అవగాహన, సాంకేతిక పరిజ్ఞనం వంటివి ఎన్నో పరిశ్రమ అభివృద్ది అవటానికి హేతువులవుతాయి. అలాంటి విధ్యాధికులు సినిమారంగంలోకి వస్తే … పెద్దలు కూడా దీన్ని ఒక వ్రుత్తి గా గుర్తించి రానిస్తే … మన సినిమా పరిశ్రమ ఫలవంత మవుతుంది అని ఆశిస్తూ…

సగటు సినిమా ప్రేక్షకుడు…

7 comments so far

  1. నెటిజన్ on

    మీ “మంచి” పుస్తకానికి నిర్వచనం చెప్పండి.

  2. కె.మహేష్ కుమార్ on

    ఎంచుకున్న విషయంచాలా విస్తృతం. మీ ప్రయత్నం అభినందనీయం. కానీ, అసమగ్రంగా అనిపించింది. అది బహుశా సహజంకూడా.

    ఒకప్పుడు బెంగాలీ సాహిత్య/సినిమా అధారిత తెలుగు సినిమాలు వచ్చేవి. తరువాత అరికెపూడి,యుద్దనపూడిల శకం మొదలయ్యింది. చివరికి మల్లాది,యండమూరిలతో ఈ ట్రెండ్ అంతమయ్యింది. మొన్ననొన్నొచ్చిన గ్రహణం, మధుమాసం,ఇదండీసంగతి తప్ప సాహిత్యాన్ని ఆధారం చేసుకుని వచ్చిన తెలుగు సినిమాలు లేవు.

    ఇక సాహిత్యానికీ-పాఠకుడికీ, సినిమాకీ-ప్రేక్షకుడీకీ ఉండాల్సిన గౌరవప్రదమైన లంకె తెగిపోయి మనదగ్గర చలా కాలమైపోయినట్టుగా గుర్తు….కానీ మార్పుకు అవకాశం ఉంది. http://www.navatarangam.com చూడండి.

  3. chandramouli on

    నెటిజన్
    మీరు అడిగిన ప్రశ్న దిశగా చూస్తే – ’మంచి’ అనే పదం సరి కాదు అనిపిస్తుంది, గొప్ప సాహిత్యం , చదివితీరాస్సిన పుస్తకాలు అని నా ఉద్దేశ్యం… నేను గొప్ప అనే పదం వద్ద తరచూ ఈ పదం వాడుతూ ఉండటం వలన దొర్లిన తప్పు కాబోలు…. ….. పుస్తకాన్ని ఉదహరించ మన్నారా…. నా ఓటు కూడా…. చివరకు మిగిలేది
    పుస్తకానికే…….

    మహేశ
    నిజమే నాకు అసమగ్రంగానే అనిపించింది కాని ఎలాగోలా కుదించాలి అని ఇలా కుదించాను…. మార్పులు చేర్పులకు దారులు చూస్తాను…. ఇది మీ కామెంటులాగా టైమ్ లైన్ లో లేక పోవటం అలాంటి భావానికి సేతువయ్యుండచ్చు…… నవతరంగంలో ఆనంద్ గారి టపా చూసాకే ఇది రాయాలనిపించింది…

  4. laxmi on

    మంచి సాహిత్యం… ఇప్పుడు ఒక మంచి పుస్తకం వస్తే మాత్రం చదవటానికి ఎంత మంది సిద్ధం గా ఉన్నారు? నాకు చిన్నప్పటినుండి స్నేహితుల కన్న పుస్తకాలతోనే అనుబంధం ఎక్కువ. అది ఇప్పటికి కూడా అలానే సాగుతోంది. ఎందుకూ అంటే చిన్నప్పటినుండి చదవటం ఒక మంచి హాబీ అని నేర్పించారు కబట్టి. కాని ఇప్పుడు ఎవరిని చూసిన ఉరుకులు పరుగులు. అందులో పుస్తకాలు చదివే తీరిక ఎంత మందికి ఉంటోంది? ఏమాత్రం సమయం దొరికినా ఎంటర్టైన్మెంట్ పేరుతో టీ.వీ లకి అతుక్కుపోతున్నారు. ఈ లెక్ఖన చాలా వరకు సహిత్యాభిలాష తగ్గింది అని చెప్పవచ్చు.

    ఇకపోతె ఏసుక్రీస్తుగా, సాయి బాబాగా నటించిన అతని పేరు విజయ్ చందర్.

    జనాదరణ పొందిన ఒక నవల ని సినిమాగా తెరకి ఎక్కించాలి అంటే చాలా కష్టం… అందులొ నతించె నతవర్గం ఇమేజ్ కి తగ్గాట్టు ఎన్నో మార్పులు చేయాల్సి వస్తుంది. అప్పటికే నవల చదివి ఉన్న పాథకుల మదిలో ఒక ఇమేజ్ నిలిచిపోతుంది, దానికి చిత్ర రూపం లో ఏ మాత్రం తేడా వచ్చినా అది నిరాదరణ కి గురి అవుతుంది… ఇది ఎన్నో సార్లు నిరూపించబడింది కూడా.

    ఇది నా అభిప్రాయం మాత్రమే.

  5. కె.మహేష్ కుమార్ on

    @నెటిజన్: “మంచి పుస్తకం” గురించి మా ప్రొఫెసర్ చేప్పే మాటలు మీ వ్యాఖ్య చూసినతరువాత ఇక్కడ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆయనంటారు “ఏ పుస్తకాన్నైతే చదువుతూ, ‘అరే ఈ విషయం నాకు తెలిసినదే, కానీ ఇంతబాగా చెప్పొచ్చని అనుకోలేదు’ లేక ‘అబ్బా! నాఆలోచనల్ని ఇంతచక్కగా ఈ రచయిత ఎలా చెప్పాడోచూడు’ అనుకుంటామో” అదే మంచిపుస్తకం అట.

    అంటే, మంచిపుస్తకం అనే డెఫినిషన్ highly individual taste and experience మీద ఆధారపడి ఉంటుందంటాడాయన.

    కాకపోతే “క్లాసిక్” అనేవాటికి వ్యక్తి,స్థలం, సమయం మరియూ భావజాలంతో సంబంధం లేకుండా అందరు ఇష్టపడేవి అంటారు. కొంత contradiction గా అప్పట్లో అనిపించినా, ఇప్పుడు బహుశా తను చెప్పింది చాలావరకూ సత్యం అనిపిస్తుంది.

  6. chandramouli on

    లక్ష్మీ గారు,

    మీరు చెప్పినది సబబే, కాని చదవాలి అనుకునే ఉన్నారు, అలాంటి వారిని చదివించే వారిగా మార్చే రచనలు రచయితలు చేయాలి అంటాను,
    ఉదాహారణకు : డా విన్సీ కోడ్ నవల , చదవటం అలవాటు లేని వారిని కూడా చదివించింది, సిడ్నీ షెల్డన్ నవలలు కూడ ఎంతో మంది కొత్తవారిని పుస్తకాల చెంతకు చేర్చాయి.
    ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి అని నేను అనను కాని కొంత ఆశా జనకమయిన సంఖ్య ఉండాలి సాహిత్య మనుగడకు అంటాను.

    సినిమాలు – సాహిత్యం :
    నిజమే దేని శైలి దానికి ఉంది, తీసే వాడికి రెంటి శైలి మీద అవగాహన ఉంటే అది కష్టమవదు, మీరన్నట్టు తెలుసు పరిశ్రమలో ఇలా ఇమేజ్ భంధీలు ఎక్కువే, మార్పుకు సమయం తీసుకున్నా రాకపోవటం అనేది ఉండదు.. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త రక్తం వచ్చి చేరుతుంది…. వేచి చూద్దాం….

  7. KRISHNA RAO JALLIPALLI on

    నిజం చెప్పాలంటే ఇప్పుడు free గా ఇచ్చినా పుస్తకాలు చదివే వారు చాలా తక్కువ. కొద్దో గొప్పో మిగిలిన పటనత్వాని కలిగిన పాఠకులును యండమూరి, మల్లాది etc. లు ధ్వంసం చేసారు.


Leave a reply