నువ్వు దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నావు?

చిన్నతనంలో అత్యంత భక్తి ప్రపత్తులతో మెలిగే వాతవరణలో పెరిగినప్పటికీ, ఊహ తెలిసే కొలది దేవుని గురించి, దేవుని ఆవశ్యకత గురించి ప్రశ్న మెదలయింది. మా తాతగారి తో మెదలయిన ఈ ప్రశ్నల పరంపర నేటికీ అంతం లేకుండా సాగుతునే ఉంది. తారస పడిన ప్రతి ఒక్కరిని నేను ఎప్పుడూ అడిగే ప్రశ్న – ” నువ్వు ఎందుకు దేవున్ని పూజిస్తున్నావు అని?”. సమాధానం చెప్పవలసిన వారు మారారు కాని, ప్రశ్న మాత్రం అలానే ఉంది. ’పిచ్చి ప్రశ్న’ అని కొందరు కొట్టి పారేస్తే, కొందరు సమాధాన పరచటానికి ప్రయత్నించారు, కొందరు సమాధానం నాలోంచే వస్తుంది ప్రయత్నించు అని వెన్నుతట్టారు. నాకు వచ్చే సమాధానాలు అన్ని, వారి వారి చేష్టితాలను సమర్దించేవి గా ఉన్నాయి కాని, వారి భావాన్ని సమగ్రంగా ప్రతి పాదించేవిగా, కనిపించ లేదు.వయసుతో బాటు ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టాలి అనే జిజ్ఞాస కూడా పెరుగుతూ వచ్చింది. నా తోటివారందరు, వారి వారి ప్రార్ధనా మందిరాలకు పోయి, వాటి గురించి బళ్ళో చర్చించుకుంటుంటే,వారినీ అడిగాను, కొందరు నవ్వారు, కొందరు అంత కమ్మని పులిహోర వదులుకునే వాడు తిక్కలోడు అన్నారు, మరికొందరు మా నాన్న ఇలాంటివి అడిగితే కొడతాడు అన్నారు(చిన్నతనం కదా అలాంటి సమాధానలు మాత్రమే వస్తాయి అని అప్పుడు నాకు తెలీదు,ఎందుకంటే నేను ఆ పిల్లల్లో ఒక్కణ్ణే).

శైశవ దశలో పెద్దలనుంచి, పిన్నల నుంచి నాకు లభించినవి సమాధానాలు అన్ని దద్దోజన పర్యాయపదాలే. స్కూలు దాటి కాలేజీలోకి చేరేలోపు, పీఠాధిపతులనుంచి పీచు మిఠాయి అమ్మే వాడివరకు అదే ప్రశ్నని అడుగుతూ ఒక రౌండు ముగుంచాను.(ఇంటర్)కాలేజీలో చేరిన మెదటిరోజు. బడిలో లాగానే, ప్రార్దనతో మెదలవుతుందేమో అని గ్ర్రౌందులో కాసేపు ఎదురు చూసాను,కాని అక్కడ సర్వస్వతీ నమస్తుభ్యాలు (ఎండలో,చలిలో), సాయంత్రం జనగణమణలు ఏమి లేవు అని తెలుసుకోగానే, నాలో యక్షుడు నిద్రలేచాడు, పది సంవత్సరాలు పాటు ప్రతి ఉదయం పఠించినప్పటికి ఉచ్చరణాదోషాలు లేకుండా ఆ ప్రార్దన చేసేవారు కనపడటం అరుదు. ప్రార్దన, అదొక నియమం, అంతకన్నా ప్రార్దన చేసే వారికి కాని, చేయించే వారికి దాని ఆవశ్యకత ఎంతతెలుసో నాకు తెలియదు. ఇది గమనించిన నాకు, అక్కడి వారు నాకెందుకో హేతుభద్దమయిన వారులా కనిపించారు.ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే వారు ఇక్కడ దొరుకుతారేమో కనుక్కో అని నాలో యక్షుడు తొందర పెడుతున్నాడు. అక్కడ అంతా కొత్త మొఖాలు, కాని మొఖమాటాన్ని, నా ఉత్సుకత జయించింది. తారస పడిన వక్త(వ్యక్తులనుకను పొరబడేరు) లందరని అడుగుతూ వచ్చాను. కొత్తగా కాలేజీలో గ్రూప్ డిస్కషన్లు, వ్యాసరచనలు, ఇలా ఎక్కడ అవకాసం దొరికినా అదే ప్రశ్న… “నువ్వు దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నావు?”.అన్ని ప్రయత్నాలు సమాధాన శున్యాలే. (ఒక చిన్న్ విన్నపం, నాకు సమాధానం చెప్పలేక పోయారు అని నేను హేళన దృష్టితో నేన్నెడు చూసింది లేదు, చూడ బోయేది లేదు.ఎవరి పంధావారిది, ఎవరి నమ్మకం వారిది).

నాకు ఇందులో సమాధానం దొరకవచ్చు అనిపించిన పుస్తకాలు అన్నీ(నా పరిధిలో) చదివాను, ఒకదానికొకటి సంభందం వున్న పుస్తకాలే అవి, కాకపోతే మార్గాలు, విధానలు భేదం. కానీ నా ప్రశ్నగురించి ఊసేలేదు. ఎలా పూజించాలి, ఎన్ని రకాలుగా పూజించాలి, ఆఖరికి ఏ పనికి ఆదేవుడు, ఏపనికి ఆ పూజ స్తాయిలో అత్యంత నిర్మాణాత్మకంగా ఉంది. పక్కమతాల్లో కూడా చూశాను, రమారమి అన్ని మతాల్లో నాకు దొరికినంత వరకు చూశాను, ఒక నమ్మకం ఆధారంగా జనించిన ధాతువులే ఇవన్నీ అని తెలుస్తుంది కానీ.నాకు మాత్రం అవే సమాధానాలు, అవే ఈసడింపులు, ఎక్కిరింపులు….. అప్పుడప్పుడూ ప్రోత్సాహాలు…

కొంతకాలం నా ప్రశ్నే తప్పేమో అని అలోచించాను,కాని ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే గాని నిర్ణయించలేని పరిస్తితి. చివరికి స్నేహితుని తల్లి, చాలా సహనం కలిగినావిడ, చిన్నతనం నుంచి నా ప్రతి ఉపప్రశ్నలకు (ఆ ప్రశ్న అడిగినప్పుడు జనించే ప్రశ్నలు) సమాధానం చెబుతూ ఉండేది. కొంతకాలనికి ఆవిడక్కూడా విసుగొచ్చింది కాబోలు సమాధానాలు చెప్పటం మానారు. కాని ఆవిడ చెప్పిన సమాధానాలే నాకు తరచూ మిగిలిన వారందూ వారి వారి పరిభాషల్లో చెప్పేవారు. మచ్చుకు కొన్ని రాస్తను ఇక్కడ..

౧. ఆధ్యాత్మిక ఆనందం ( వయస్కులు, గురువులు , ఆపైన వారు చెప్పే సమాధానం)
౨. కోర్కలు నెరవేరాలి ( సాధరణ జనం , అప్పుడప్పుడూ లక్ష్మీపుత్రులు చెప్పే సమాధానం)
౩. పారంపర్య సంక్రమితం( దేవుడు చల్లగా చూడటం వల్ల ఇలా ఉన్నాం అని నమ్మే వారందరు చెప్పే సమాధానం)
౪. ఎందుకు అనవసరంగా రిస్కు ( బెనిఫిట్ ఆఫ్ డౌట్ – ఎక్కువగా యువత చెప్పే సమాధానం)

ఇవీ సమాధానాలు, ఇక్కడ అపహాస్యాల గురించి కూడా రాయాలి

౧. నాస్తికులు, హేతువాదులతో పోలికలు ( సమాధానం చెప్పలేకపోవటం, చెప్పాలి అనుకోకపోవటం అవమానంగా భావించిన వారు )
౨. పైన చెప్పిన శ్రేణి
౩. పైన చెప్పిన రెండు శ్రేణులు.
ఆ సమాధానాలు అన్ని నాకు అసమగ్రంగానే కనిపించాయి. ఒక్కొక్కటిగా చూస్తే …

౧. ఆధ్యాత్మిక ఆనందం:- సమయాభావం ఉన్నవారికి కలిగేది కాదు, పనినుంచి విశ్రమించిన వారికి, దైవార్చనే జీవిత పరమావధిగా కలిగిన వారికి మాత్రే దక్కే అమూల్య మయిన భావన అది సాధారణ వర్గానికి చెందే సమాధానం కాదు. గంటల తరబడి ఇదే సత్యం అని,ఇదే సత్యం అని నమ్మితే, ఎంతటి భేదాలోచన అయిన ఆత్మ సంత్రుప్తిని కలుగజేస్తుంది, మానసిన ఆనందాన్ని కలుగా జేస్తుంది. కనుక అక్కడ ఆధ్యాత్మిక ఆనందం సాధనం అనేద ఒక వ్యాపకం, దానికి దేవుడు అనేది ఒక మార్గం. ఆధ్యాత్మిక్ అనుభూతి అన్ని మతాల్లో, అన్ని వర్ణ వర్గ జాతుల్లో సమానంగానే ఉంటుంది. అన్ని విషయాల్లాగే మార్గం మాత్రం మార్పు.

౨. కోర్కెలు నెరవేరాలి:- “ఈ సమస్యకు ఎవరన్నా సహాయపడాలి్” – అన్న సాధారన మధ్యతరగతి జనితమయిన భావనకు తార్కాణం. పక్కవారిని అడగాలి అంటే చిన్నతనం. కనుక అజాతశత్రువు అయిన పరమాత్మే వారికి సహాయ పడతాడు(పడాలి) అన్న నమ్మకం.

౩. పారంపర్య సంక్రమితం:- ముందు తరం వారు ఇలానే తమ జీవనం సాగించారు నేను కూడా చేస్తున్నాను.

౪. ఎందుకు అనవసరంగా రిస్కు:- నష్టంలేనప్పుడు చేస్తే తప్పేముంది అన్న ఆలోచనకు మరోరూపం,దేవుడు, నమ్మాకాలు ఒకరోజు నిజమయితే ….. అన్న భావన.

ఇవన్నీ చూసిన/విన్న/చదివిన తరువాత సమాధానం వచ్చినట్టే కదా అనిపిస్తుంది. కాని ఆ శ్రేణులు చూపిస్తున్న కారణలు మరో రూపేణా చేసే అవకాశం ఉన్నప్పుడు, అలా రో రకంగా చేస్తున్నవారికి సరి యయిన సామాజిక గౌరవం లభించాలికదా? కాని వాస్తవం మరో రకంగా ఉంది. సానాతనులు,చాందసులు పక్కమతాలను దుయ్యబడుతుంటే, హేతువాదులు వీరిని అపహాస్యం చేస్తూ చివరికి తమ తమ వ్యక్తిత్వాన్ని పోగుట్టుకునే స్తాయికి దిగజారుతున్నారు.

అంటే భావాలని నమ్మి వాటిని పాటించే వారు ఆశించేది ఇంకేదన్నా అయి ఉందా? ఉంటే ఏమిటది ?

కనుక నా ప్రశ్న అలానే మిగిలి ఉంది…

ఇప్పటికి 4 వ్యాఖ్యలు

  1. x on

    The question you have is completely wrong. Why should you LOVE God? Here is the answer SV said.

    “If I want to be a robber, I will rob the King’s treasury and if I want to be a hunter, I will hunt the Rhino. What is use of hunting ants and robbing beggars? So if you want to love, love God”

    Swami Vivekananda

    Change your outlook. You should never “pray” to anyone who you do not love. This includes your parents or God or whoever.

  2. కె.మహేష్ కుమార్ on

    అజాతశతృవు, అత్యంత స్నేహశీలి, అందరినీ సమదృష్టితో చూసే ప్రేమస్వరూపుడు భగవంతుడైతే, అందుకు ప్రతిగా ఆయనకు మన భక్తెందుకు, పూజలెందుకు, ప్రేమెందుకు?

    అంత unconditional గా ఆయన మనల్ని ప్రేమించేవాడే అయితే, ఈ బూటకపు సాంప్రదాయాలూ ఆచారాలూ ఎందుకు? ఎవరికోసం?

    ఆయన దృష్టిలో అందరూ సమానులైతే ముస్లింలూ,క్రైస్తవులూ,సిక్కులూ ఇతరమతాల వారుమాత్రం తనవారు కాకుండాపోతారా? హేతువాదులూ,దైవధూషకులనూ ఆయన సమంగా చూడటం మానేస్తాడా?

    దేవుడిక అతీతశక్తైతే, let him/her be there…that’s his business. ఆయనకు గుత్తాధిపత్యం వహించే మతాధిపతులకున్న అధికారమెంత?

  3. chandamouli on

    మీరు నిజంగా ఈ వ్యాసం చదివారా? లేక నేను తప్పురాశానా?
    మీరు చెబుతున్నదే నేను మరో విధంగా చెప్పాను…. ఇద్దరూ సుంఠలు అన్నారు.నేను ఇద్దరు సమానమే అన్నాను….
    ఇద్దరిలో తప్పులు చూపించి రెండు అవసరం లేదు అన్నారు. తప్పుతో బాటు ఒప్పులు కూడా ఉన్నయి అని నేను అంటున్నాను.

    అయినా నా వ్యాసానికి మీ ప్రశ్నలకు సంభందం ఏమిటో నాకు అర్దంకాలేదు.
    మీ ప్రశ్నలు సమాధానాలు వరుసగా
    ౧. ఆయన అడిగాడా, చేయకపోతే తంతాను అని చెప్పాడా. అది ఒక మానసిక ఆనందం. ప్రతి మనిషికి అది మారుతుంటుంది, అందుకే ఇన్ని రకాలు. ” ”
    ౨. మీకు బూటకమయినవి,అనాచారమయినవి మాత్రమే మీకు కనిపిస్తే , తప్పు నాది కాదు ?
    ౩. వారు వేరు, వీరు వేరు అని, మనుషులు రాసుకున్న రాతల్లో ఉన్నాయి కాని దేవుడు రాసినివి నాకు తెలిసి లేవు. అవి దేవుడు రాసాడు అని మీరు నమ్ముతుంటే, మీరు అడిగే ప్రశ్నకు సమాధానం రాసినతన్నే అడుగుదాం…ఆయనే రాసాడు అని మీరు నమ్ముతే …ఆయన ఉన్నట్టే కదా మరి.
    ౪. ఖచ్చితంగా వంద వ్రతాలు చేశాడు కదా అని దేవుడు ఒక పాపానికికూడా శిక్షతగ్గించడు(పురాణాలు కొన్ని కధలు ఉన్న మాట వాస్తవం, అవి మార్పుని ఆశించి రాసినవి అని ప్రతేకఉటంకింపులు అనవసరం). అలానే తప్పుకు దండన, మంచికి స్వర్గం (అసలు ఇవన్ని ఉంటే).. అసలు హైందవంలో పూజలు చేస్తే పాపాలు పోతాయి అని లేదు, శాంతి చేకూరుతుంది అని మాత్రమే ఉంటుంది. దానికి కొద్దిగా కెచ్ అప్ వాడి పటాపంచలయిపోతాయి వగైరా వంకాయలు చేర్చబడ్డాయి(మార్పు మంచికయితే తప్పులేదు).
    ౫. మఠాది,పతులు పీఠాది పతుల్లు అన్న పారంపర్యం,గుత్తాది పత్యం అనేది మతం నేర్పినది కాదు, మనిషి చేర్చుకున్నది.

    ఇంతకీ మీరు కూడా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు …..

    చివరగా ….
    ఒక మంచి మాట అన్నారు…let him/her be there…that’s his business.

  4. durgeswara on

    vignatanu kolpokumdaa saagutunna meeamtarmadhanaaaniki abhinamdanalu. meeku vupayogapadataayemo choodamdi yekkiraala bharadvaaja gaari rachanalu. aayanakoodaa vedapamdituni kadupunaputtikoodaa bhagavamtuni unikinigoorchi samdigdatato saagimchina payanamlo aayana anubhavaalu meeprasnalaku samaadhaanamiyyavachchu. ongole ledaa hyderaabaad lalo aayana rachanalu dorukutaayi prayatnimchi choodamdi. maredannaa sahaayam kaavalasi vaste mail cheyamdi.chetanayite chestaanu.


Leave a reply