Archive for the 'కవితలు/తవికలు' Category

నా కలంలో ….శ్రీ శ్రీ సిరా …. (పేరడీ)

రాచరిక నాగరికతలో, ఆర్యులు చేర్చిన ఈ కుల సంస్కృతి నానాటికి పరిధిమించి పోతుంది. ఆకలేసిన వాడికి అన్నం పెట్టడంలో,అడుక్కునే వాడికి దానమివ్వడంలో కూడా కులం మతం చూస్తూ మానవత్వానికి దూరంగా పారిపోతున్న …ఈ సభ్యసమాజపు సగుటుని అలముకున్న నిశీధిని … సమస్వామ్యపు వెలుగులతో నింపమని …. చైతన్య కవులను వేడుకుంటూ ..ఈ కవిత .. కులనిర్మూలనకు తోత్పడే వాళ్ళందరికీ అంకితమిస్తున్నాను ..

 —–

కులాలనన్ని కలాల దున్ని,
జనావనంలో,మనో తలంలో,
నిషస్సు మండగ,ఉషస్సు నిండగ-

విచక్షణెరుగక విజృంభించి,
కులమత్తున కీచకులై,
మతమంపున సైంధవులై,
మనప్రగతికి మంటబెట్టే,
రాక్షసరూపుల కాష్టం పేర్చే,
కవి రాజుల వజ్రకలానికి,
ధర్మబలానికి సమానమంటూ,
మరేది లేదోయ్!

పదాల పదును,
ప్రయోగ సత్తువ,
నవసమాజం నిర్మించాలని,
సమసమాజం స్తాపించాలని,
ఇలలొ,కలలో,కవితల్లో,
పరిశ్రమిస్తూ,
పరిప్లవిస్తూ,
సాహిత్యానికి దాస్యం చేసే,
కులతంత్రపు కోరలు పీకే,
అక్షరవీరుల కలముల నిండా,
కణకణ మండే,గలగల పారే,
విప్లవాగ్నికి,విమర్శ ధాటికి,
పగ్గం వేశే ప్రకోపధాముడు,
ధరాన లేడోయ్..

భాష్యం చెప్పి ,చోద్యం చూసే,
గళాసురావుల,కళావరాసుల,
కుత్తుక కోసే కలములుబట్టి,
చరిత్రపేర్ఛిన,అనాది నిలిచిన,
కుల పునాది కూల్ఛే ఘంటముబట్టిన,
అక్షరనాధుల విప్లవధారలు,
ప్రతిద్వనిస్తాయి,ప్రఉజ్వలిస్తాయ్,
మనోద్యమానికి ప్రభలు కదుపుతాయ్,

నాలుగు రంగుల హైందవస్తోత్రం,
రాముడు కాచిన రాక్షస చట్టం,
కృష్టుడు కూల్చని కుతంత్ర సౌధం,
బుద్దుడు పాడిన స్వతంత్రగీతం,
మరొక్కసారి,మరొక్కసారి,
జనాలకోసం,మనోళ్ళకోసం.
సంరావిద్దాం మన హ్రుదయ మృదంగం,
అలా అలా ఎత్తిన గొంతులు,
మత్తుగ ముసిగిన మనుషులలేపే,
ప్రభాతభానుని గీతికలవుతాయ్

ఇదే !!,ఇదే !!,
నే వినిపించే,
నే విరచించే,
నవీన రీతిన స్వేచ్చాగీతిక,
నా మనసున పాడిన ప్రచండ డోలిక,
కులషోదక ఝంజాపవన మాలిక..

– చంద్ర

హుస్సేన్ సాగర్ ఎరుపెక్కిందట ?

కాషాయపు దాష్టీకమో,
పగ బిడ్డల దౌర్జన్యమో,

మతమూర్ఖులు చేసారో,
కులరాజులు తలచారో,

            జరిగిందీ అనర్దం,
            ఎదుర్కొనగ సమర్దులం

సిద్దాంతం ఉపిరిగా,
సమహక్కులు ధ్యేయంగా,

ఎరుపెక్కిన కళ్ళతో.
నిగ్గదీయు నోళ్ళతో,

            సంద్రంలా కదిలోస్తం,
            పెనుఉప్పెనయి కబళిస్తాం…

—  సుందరయ్య భవన్ మీద స్వదేశ మ్లేస్చ్యులు చేసిన దాడిని నిరసిస్తూ…. పరస్పర గౌరవం నాగరిక సమాజానికి మొదటిమెట్టు అని మరో సారి గుర్తు చేస్తూ ఒక అరుణ కిరణం —-

తరువాతి కాగితం »