Archive for the 'బల్ల గుద్ది చెప్తా' Category

తన జన్మ కారకుని(ల)తో ఇలా మెర పెట్టుకుంటుంది …?

మతం .. తన జన్మ కారకుని(ల)తో ఇలా మెర పెట్టుకుంటుంది …?

మతావగహన లేని వ్యక్తి :

ఇదిగో …,ఎన్నాళ్ళనించో నిన్ను ఒక(బోలెడు) మాట(లు) అడుగుదాం అని చూస్తున్నా… ఇన్నాళకు దొరికావ్.

అయినా, నీ ఆచారాలు, చేష్టలు, నమ్మకాలు అన్నీ నీకు వెటాకారంగా కనబడుటలేదు, మనుషుల మద్య అన్న చెల్లి, తల్లి కొడుకు వంటి భందాలకు విలువలేనంతగ మానవుడు పురోభివ్రుద్ది సాధిస్తూ వుంటే నువ్వేంటమ్మ ఇలా!!.. అబ్బే …. నీకు చీమ కుట్టినట్టయిన వుందా అస్సలు …

నిన్ను కాదుగాని అస్సలు … ఎమయ్య.. మత మానస పుత్రా మాతోన్మాదా … నువ్వు చెప్పు .. ప్రతీ దానికీ వకాల్తా పుచ్చుకుంటావుగా …

మతోన్మాది :
అబ్బా చాల్లే వయ్య… చెప్పొచ్చావ్ …… అద్గదిగో .. పక్క మతం లో ఫలాన చోట తప్పుంది … ఇద్గిదిగో ఇల్లీ మతం లో ఇల్లిక్కడ తప్పుంది …

(నిమిషాల్లో తను మనిషినని మర్చిపోయో అది ఏదో పురాణగాధలో పరమ విక్రుత రాక్షస మనస్సుని ఆవహన చేసుకుని ..అంటూ ..మెదటగా జిహ్వాయుధం దరించి… దానితో యుద్దంచేస్తునే … పిమ్మట మరొక అందివచ్చిన అయుధంతో ……) మా మనో భావాలు దెబ్బదితినేట్టు .. ప్రవర్తిస్తావురా .అంటూ..డిషేల్ ..ధడేల్ … ఫేడేల్ …

మతం:
(మతావగహన లేని వ్యక్తిని సంభోదిస్తూ ) బిడ్డా.. నన్ను నీ లాంటి వారు సమాజ శ్రేయస్సుకోసం ఇలా పుట్టించారు … నేను స్వాయంభువును కానయ్య … కాన కొన్ని ఆచారాలు కాలాన్ని బట్టి మారిపోతాయి … అలా మారకుండా వుంటే రాచ పుండులా మారి నన్నే దహించి వేస్తుంది..
మతంలో కాఠిన్యత ఆ కాలమానం ప్రకారం ఒక వుపయోగం కోసం రాసారు అని గ్రహించ వయ్యా …
ఉదాహరణకు - స్వకుల వివాహ నియమం తీసుకో:
శ్రమ విభజనకోసం కులాన్ని నాలో భాగం చేశాడు నా తండ్రి .. ఒకే కులం వాళ్ళు పెళ్ళి చేసుకుంటే భార్య భర్తలు శ్రమ పంచుకోవచ్చని అలా స్థిరీ కరించాడు …. ఇప్పుడు శ్రమ సంకరమయిన ఈ యుగంలో అదే కట్టు బాటుకు దాస్యం చేస్తున్నారు … ఇంతలా అభ్యుదయవాదం వల్లె వేస్తున్నావే .. నీకు జీర్ణకాని అభ్యుదయం ఏదన్నా నీ ఇంట్లో వెల్లి విరిస్తే … నీకు అపోలో హ్రుదయ విభాగ వైద్య సేవ మెదటి అవసరంగా రాదంటావా ….
ఇలాంటివి కోక్కొల్లలు .. కాలాను గుణంగా మారలేని పెద్ద పెద్ద భూచర జల చరాలే అంతరించాయి ..
(అని అనాలనుకుని ….ఇలా చెబితే ఎవరన్న తెలివయిన మతోన్మాది తనను ప్రక్షిప్తం చేసి తన అలోచెనలు మనుసులో దాచుకుని ….)
సర్వే జనా సుఖినో భవంతు … అని దీవిస్తూ చేయి వూపుతుంది …..
ఒక మతాయోమయం :
హహ … హహ్హ … మతం అంటే దేవుడు …. దేవుడంటే మతం అని వుపన్యాసం ఇస్తున్నాడు …

మతం :M
నవ్వుకుంటూ మనసులో అనుకుంటుంది (పక్కనే ఉన్న మతోన్మాదికి భయపడి మరియు మతావగాహ లేని వ్యక్తి ప్రశ్నించిన ప్రశ్న జ్ఞప్తికి తెచ్చుకుని )…
అయినా నేను ఒక జీవన విధానం …అందులో ఆధ్యత్మికత అను భాగన్ని దేవుడి పేరుతో పాటిస్తారు …

ఈ జీవన విధానంలో ప్రతి కార్యానికి ప్రతి చర్యకు శుభం జరగాలి అని ప్రతి జీవికి వుంటుంది కనుక దేవుని సుభప్రద కారకునిలా తలచి/ఆపాదించి/ ఆమోదించబడి (ఈ స్తానం ఎవరన్న పూరించ వచ్చు… దైవానికి మారుగా ).. అన్ని విషయాలకు ఆ భావన్ని తలుస్తూ … కార్యాచరణ చెయ్యండి అని కదా నా తండ్రి నిర్ణయించిన నిర్దిష్ట విధానం … దీన్నే కదా మీరు “పాజిటివ్ థింకింగ్ అవసరం” పని చెయ్యటానికి …అని తెగ ఘంటా భజాయిస్తున్నారు … ఈ మద్య ఇదే విషయంతో కోట్లల్లో వ్యాపారాలు చేస్తున్నారు ….. అదే నేను,నేను పుట్టిన కాల రూపేణా చెబితే అనాచారమయిందటోయ్ … నువ్వంటే చదువు కున్నావ్ కాబట్టి నీకు అన్నీ తెలుస్తాయి … మరి అన్ని ప్రాణులు సమాన ప్రతిభ /ఆలోచనలు కలివుండటం దుస్సాధ్యం కదా అందుకే అలా విధానం నిర్ణయించాను ….. అలాంటి ఆలోచెనను వ్యాపారత్మకం చేసింది మీలాంటి ప్రభుద్దులే కదా ….

ఇప్పుడేమో జీవన శైలి , సమాజ శ్రేయస్సు వంటివన్ని శిధిలం చేసి , కొన్ని పూర్థిగా కాలగర్భం లో కలిపేసి …… దేవుణ్ణి కొలిస్తే అన్ని వస్తాయి అనే స్తాయికి నన్ను నా అలోచెనను దిగజార్చింది మీరు కాదు ….(పుర్వీకులతో కలిపి) …. తన ఉనికిని కాపాడుతున్న ప్రజలను భక్తుల అచేతనానికి ఒకింత జాలి పడింది … భాద పడింది ….

ఇంతలో ఒక మతబాహ్యడయిన హేతువాది, మతావలంబీకుడయిన హేతువాది మాట్లాడుకుంటూ రావటం చూసింది మతం …. ఏమి మాట్లాడుకుంటున్నారబ్బా అంటూ తన కర్ణమటువైపుతిప్పింది…
(ఇంకావుంది…)

మతప్రాతిపదిక మీద రిజర్వేషన్లు - మత మార్పిడులు - ఓటు బ్యాంక్ రాజకీయాలు

చలం గారు అన్నట్టు కొత్తతరం వేసే సహేతుక ప్రశ్నావళికి దద్దరిల్లిన పెద్దరికం పిన్నలు ప్రశ్నించటాన్నే అనాచరంగా మార్చివేసింది అని - అలా చలం గారి మాటను పూర్తిగా నిజం చెయ్యకుండా ఈ కాలంలో ఎంతోమంది తమ తమ విశాల ద్రుక్పధాన్ని చూపుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను …నేను సందేహాల పుట్టని - అందులోంచి ఒక సందేహం ….

స్వాతంత్రానంతర సమాజ పరిస్థితిని ద్రుష్టిలో ఉంచుకుని ప్రతిపాదించిన ఈ రిజర్వేషన్లు అందరికి చిరపరిచితమే. హిందువులలో నిమ్నకులాలుగ,అతి సూద్రులుగా పరిగణింపబడుతున్న జన బాహుళ్యనికి చేయూతనివ్వడంకోసం అందించిన ఈ రిజర్వేషన్ అంటే నాకు మొదటినుంచి మంచి అభిప్రాయమే వుందికనుక (కొన్ని కీలకమయిన చదువులకు పదవులకు సంభందించిన రిజర్వేషన్లు తప్ప - వాటికి కులం మతంకన్నా సత్తా ముఖ్యం అని నా వుద్దేస్యం) వాటి గతి గురించి నేను ప్రశ్నించను కానీ మత మార్పిడి చేసుకుని కూడా ఇంకా పాత మతం తాలుకా లాభాలను ఇంకా పోందుతున్న వారు , అలాంటి లోపాన్ని సరిదిద్దని ప్రభుత్వము మీదా నా ప్రశ్న ..

మతమార్పిడి మీదా నాకు ఒకింత (భావ స్వేచ్చ ద్రుష్ట్య)గౌరవం వున్నప్పటికి మతమార్పిడికి దోహదం చేస్తున్నవారు, మార్చుకుంటున్నవారి మూలాలు, ప్రాతిపదికలు చూసి చూసి దానిమీద గౌరవం సన్నగిల్లుతుంది.ఇకపోతే నా ప్రశ్న ఎంటి అంటే- హిందూ నిమ్న జనోద్దరణకు సమీకరించబడిన రిజర్వేషన్లు ఇలా మతం మార్చుకున్నా వారికి ఎలా వర్తింప జేస్తున్నారు - పక్క మతస్తుల ప్రసాదన్ని ముట్టుకోవటం మహాపాపం(బైబిల్ ద్రూష్ట్య) అని చెబుతున్న మత ప్రభోదకులు ఇలా పక్క మతస్తులకు కేటాయించిన ఫలాన్ని దోచుకోవద్దని ఏ మత ప్రభోదకులు చెప్పరెందుకు …

తమ జన్మతహ సిద్దించిన మతంలో దొరకని సామజిక గౌరవం చేయూత పక్కమతంలో దొరుకుతుందని ఆశిస్తూ పక్క మతాన్ని స్వీకరిస్తున్న వారి కొత్త జీవన సరళిని చూచిన మీదట, వారి భవాలను దగ్గరగ పలిశీలించిన మీదట వారు అశింఛిన ఫలితం దక్కింది అనుకుంటున్నాను.

రాజ్యంగ భద్దంగా ఆలోచించినా కూడ వారికి కొన్ని సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వమని కదా నిభందన. అంటే రిజర్వేషన్లు కల్పించబడిన సమయంలో వారు జీవన స్థితిగతులు మెరుగు పడతాయి కనుక వారికి ప్రత్యేక రాయితీ అవసరం ఉండదు అని వారి యోచన. మతం మార్చుకుని వారు అతి తక్కువ కాల పరిమితిలోనే రాజ్యంగం కోరిన విధంగా మెరుగయిన జీవన స్థితిని చేరుకుంటున్నారు కదా …

ఇలా మతమార్పిడికి లోనయిన వారికి కేటాయించిన మొత్తం దుర్వినియోగం అవుతుంది అని నా అభిప్రాయం . దీన్ని అరికట్టి సరిగా వినియొగించటం …సాద్య పడదా ??

తరువాతి కాగితం »