‘Uncategorized’ అనే వర్గంలోని టపాలు
క్షుద్ర శక్తులను సమాజంలోకి ఎవరూ జొప్పించారు ….??
రాతిగుహలనుంచి రాతి మహళ్ళకు ప్రస్తానం సాగించిన మన చరిత్రలో మనకే అంతుపట్టని అధ్యాయాలు అనంతం. కూటికోసం,గూడుకోసం పోరాడిన ఆనాటి ఆటవిక జీవన గమనం నుంచే ప్రకృతి శక్తిని గమనించిన మానవుడు తమ తమ బౌతిక,మానసిక,రాజకీయపరిస్తితులకు అనుగుణంగా అనేక శక్తిరూపాలను ఈ సమాజానికి పరిచయం చేశాడు… దేవుడని, దయ్యాలని మహమ్మారులని పిశాచులని అనేక భావనలు మనలో జోప్పించాడు, అవే కాల క్రమేణా కొన్ని దైవకమయిన భక్తి భావాలుగా రూపాంతరం చెందితే మరొకొన్ని అమానవీయాలు,క్షుద్రభావాలు,మూడనమ్మకాలుగా వెలుగు చూశాయి…… ” ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు” అన్న ఆ త్యాగరయలు ఏ భావంతో చెప్పాడోకానీ మన చరిత్రలో వెలుగు చూశిన ప్రతి శక్తిరూపానికి,ప్రతి నమ్మకానికి వెనుక ఒక సామజిక అవసరం దాక్కొని ఉంది, ఆ అవసరమే అనేక భావలకు,నమ్మకాలకు హేతువయిందనుకోవటం కొంత మింగుపడని విషయమయినప్పటికీ…..ఊహాజగతికే అందని సాంకేతిక పురోగతితో ప్రకృతినే శాశిస్తున్న మానవుడు…. వేల సంవత్సరాలనుంచి తాము అనసరిస్తున్న దైవిక , క్షుద్రభావలను ఒక్కసారి సింహావలోకనం చేయవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.
భయం,భాద,ఆనందం,ఏడుపు,తన్మయత్వం ఇలా సృష్టీలో మరే ప్రాణికీ లేనటువంటివి ఎన్నో మనకు సిద్దించాయి. సృష్టి క్రమంలో మనిషిరూపాంతరం చెంది ఈ ఉన్నతదశకు చేరాడు అని శాస్త్రవేత్తలు చెబుతుంటే, దేవుడు తన రూపాన్ని మనిషికి ఇచ్చాడు అని ఆస్తికులు చెబుతున్నారు. ఎన్నటికీ తేలని ఆ నిజానిజాలను పక్కకు పెట్టి ఒక్క సారి మానవునికి సంక్రమించిన జ్ఞానేంద్రియాలు,ఈ ప్రకృతిలోని పంచభూతాలకు శక్తిని గుర్తించడం జరిగిన మానసిక సంఘర్షణలు మెదలయిన కాలానికి పయినించి చూస్తే సమాధానం దోరకని అనేక గుప్తప్రశ్నలకు ఇట్టే సమాధానం దోరుకుతుంది . రమారమి క్రీస్తుకు ఇరవై వేల సంవత్సరాలకు పూర్వమే మనిషి పూర్తి రూపాన్ని సంతరించుకుని నేటి నాగరిక జీవన దిశగా కదులుతున్న సమయం, ఆ కీకార్ణ్యపు అడవిలో కొన్ని ప్రత్యేక శక్తులు కలిగిన ఏకైక చరజీవిగా, క్రమేణా తన ఆధిపత్యాన్ని చాటుకున్న మనిషి, ఎండ,వాన,చలి,మెరుపులు,పిడుగులు,మంటలు వంటి సాధరణ ప్రకృతి స్పందనలు తన శక్తికి మించినదని, ఈ చరాచర జగత్తులో (మనిషిని)తనను మించిన శక్తి ఏదో ఉందని అదే ఈ సర్వజగత్తును నడిపిస్తుందని నమ్మట్టుగా చేశాయి. విజ్ఞాన సరస్వతులయిన ఈ కాలం వారికి ప్రకృతిగురించి ఈ మాత్రం అర్దంచేసుకోవడానికి ఒక్క అర్దగంట సమయం సరిపోతుంది కాని మంటను మంట అంటారు అని, అది ముట్టుకుంటే భాదిస్తుందని ఒక నిర్దిష్ట్మయిన అవగాహన,ప్రమాణం లేని ఆ కాలం వారికి అనేక సంవత్సారాలు పట్టింది.
అలా ప్రకృతిలోని శక్తిరూపాలను ఒక్కొక్కటిగుర్తుస్తూ తన విజ్ఞానాన్నంతా తదుపతి తరలాకు చేరవేస్తూ….. గుంపులుగుంపులుగా జీవించే వారు జనపదాలుగా, తదుపరి ఆ గుంపులే, విడివిడి కుంటుంబాలతో జీవించే జనపదాలుగా, జనపదాలు నగరాలుగా, అధిపత్యపోరోలో నలిగిపోయే విచ్చిన్న రాజ్యాలుగా మారే నాటికి మనిషి సృష్టీలో ప్రతి శక్తికి నామకరం చేసి దాని మంచి చెడులను తమ సమాజంలో ప్రతి ఒక్కరికీ తెలుసి వచ్చేలా కట్టుదిట్టమయిన ఏర్పాటులు చేసుకో గలిగారు…అలా పెట్టిన కట్టుబాట్లు రాజ్య శ్రేయస్సుకోసం చేసినవే అన్ని రాజ్యం అంతా నమ్మేట్టు చేసేందుకు కొంతమంది గురువులను ఆ సమాజం పెంచి పోషించేది, ఆ సమాజంలో ఆ గురువులే ఉన్నత జీవనాన్ని, గౌరవ పదవులకు అర్హులయ్యారు, ఇలా అధిపత్య వారసత్వమవ్వటానికి నాంది పలికింది, కాల క్రమేణా వారే మతగురువులుగా, మంత్రాగాళ్ళుగా, పూజారులుగా, వైద్యులుగా రూపాంతరం చెందుతూ వచ్చారు. ప్రపంచం అంతటా ఒకే రకమయిన ఎదుగుదల అసాధ్యం కనుక కొన్ని చోట్ల ఉచ్చస్తితిలో ఉన్న భావాలు, కొద్దిగ నాగరిక పురోగతి చూసిన మరో చోట అనాగరికంగా చూడబడ్డాయి. అంతటితో ఆగక ఆ అనాగరికులను,వారి భావాలను సమాజ శ్రేయస్సుకు పెనుసవాళ్ళుగా చిత్రించేవారు.
నాగరికత పేరుతో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న ఆనాటి సమాజంలో ఒకప్పుడు గొప్పగా రాజ సంభారలు అందుకున్న అనేకమంది వారి పరపతిని కోల్ఫోయి సామాజం దృష్టిలో దుర్మార్గులుగా ఉన్మాదులుగా ముద్ర వేయబడ్డారు…ఉదాహరణకు వేద భూమిగా పరిగణించే భారతదేశంలో నిన్నమెన్నటి వరకు నీరాజనాలు అందుకున్న మంత్రసానులనే తీసుకుందాం, రాజ్యాన్నేలే రాజయిన ఈ మంత్రసానులు పురుడుపోయందే ఈ భూమ్మీదకు వచ్చేవారే కాదు, వారికి ప్రత్యేక శక్తులు ఉండేవి అని నమ్మేవారు, వారు సాధరణ సమాజికునివలే కాకుండా, గంభీర వదనలాతో, స్పష్టమయిన మాటతీరూ,కట్టుబోట్టూ వారి స్తాయిని సామాజంలో ఎన్నో వేల సంవత్సారాలు పదిల పరచింది, అలాంటి మంత్రసానులు ఉనికి ఈనాడు అత్యల్పం…. మరోక్క ఉదాహరణ, వేదకాలంలో రుగ్వేద,యజుర్వేద,సామవేదాలతో బాటు అధర్వణ వేదం కూడా సమాన స్తాయిని కలిగి ఉంది, రుగ్వేదాన్ని నేర్చుకునేమ్త నిష్ట్ బయభక్తులతో అధర్వణ వేదాన్ని నేర్చుకునే వారు, మనోవాక్ ఫల సిద్దిని కలిగించే అనేక క్రతువులు అందులో ఉండేవి …అలాంటి వేదానికి ఎత్తిపొడుపు తప్పలేదు….
……… ఇలా నాగరిక రహదారి నుంచి నెట్టి వేయబడిన అనేక భావాలు కాల గమనం రూపాంతరం చెంది, వికృత శక్తులుగా పిలువ బడుతూ వచ్చాయి. ఆ అదను చూసి, మానవుడు విసర్చించిన ఒకప్పటి గొప్పబావలను,వాటి నుంచి ఉద్బవించిన నమ్మకాలనే దెయ్యాలు, పిశాచాలుగా మార్చి సమాజంలో ఒక ఆరోగ్యకరమయిన భాయన్ని కల్పించడానికి, ఆ భయాన్నే ఉపయోగించి వారు నమ్మే భావానికి(దైవిక భవానికి) దగ్గర చేసిన ఆనాటి సమాజ నిర్మాతలు చతురులే…..!!!!!!!!
కలికాలం గోరీలు……….
నిన్న రాత్రి అఫీసు ముగించుకుని, మెస్ లో భోజనం చెయ్యడానికి వెళ్ళాను. మెస్ ఓనరు నాకు బాగా పరిచయస్తుడు. అతనితో మాట్లాడుతూ ఉన్నాను. అతను పెద్ద అంజనేయస్వామి బొట్టు పెట్టుకుని(సింధూరం), గల్ల దగ్గర కూర్చుంటాడు అయన వెనక పెద్ద దేవును విగ్రహాలు, మెస్ గోడలకు పటాలు చిన్న సైజ్ ప్రార్దనా మందిరంలా ఉంటుంది. ఇంతలో ఇద్దర ఒరిస్సా కుర్రోళ్ళూ అనుకుంటాను, వచ్చి మెస్సా అయనకు గడప ముందు మురికి కాలవ దగ్గర ఏదో చూపిస్తున్నాడు…. నాకు హిందీ సరీగ్గా రాదు కాని మేనేజ్ చెయ్యగలను, ఆయన చెబుతున్నది ఏమో అర్దంకాలేదు… చివరకు పోల్చుకోగలిగాను … అది ఒక బియ్యం బస్తామీద ఉన్న ఆంజనేయుడి చిత్రం, ఉత్తిగీతలతో గీసినప్పటకీ ఆకారం స్పష్టంగా కనబడుతుంది…. వాళ్ళూ మరీ మరీ చెబుతున్నారు తీసేయ్యమని… ఈ పెద్ద ఆంజనేయ భక్తుడు చిద్విలాస వదనుడయి…. తన పని తాను చేసుకు పోతున్నాడు…..
” అహం బ్రహ్మాస్మి” టైపు అయిన నాకు ఇదేంటి చెప్మా అనిపించి ఇంటికిపోయి ఆలోచిస్తూ పడుకున్నాను…. అది ఒక్క చేటే కాదు… అలా జరగటం చాల సార్లు చూసిన సంధర్బాలు గుర్తొచ్చాయి….. బ్రమరాంభ దియేటర్ లో బూతుబొమ్మలు….. భ్రమరాంభ విగ్రహం అటుపక్క ఇటుపక్కా బూతుబొమ్మల పోష్టర్లు… ఇక పోతే బోలడన్ని దేవుడి వైన్ షాప్లు… ఇలా ఒక టేమిటి…. న్యూస్ పేపర్లు మీద దేవుడి బొమ్మలు, అదే న్యూస్ పేపర్ చిన్నపిల్లల ముక్కు చేదటం దగ్గ్రర నుంచి …బోలెడన్ని వెదవ పనులకు వాడుతుంటాం….. హిందూ దేవుళ్ళే కాదనుకోడా….సమస్త మతాల అధినాయకుల చిత్రాలు అన్ని ఇలా గోరీకరించ బడుతుంటే….. చరిత్రలో మా లింగం మాయ్యా గోరీని ఎందుకు ఆడి పోసుకుంటారు…..
ఇంకా రాయలని ఉందికాని…ఇంతకంటె అవసరం లేదనిపిస్తుంది……
వ్యాఖ్యలు (2)
వ్యాఖ్యలు (2)